రేపు నియోజకవర్గంలొ కాంగ్రెస్ బిఎల్ఎల సమావేశాలు.
తాండూరు, (వికారాబాద్ జిల్లా)నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశాలు గురువారం మండలాల వారీ సమీక్ష నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ సర్ నియోజకవర్గ కన్వీనర్ కరణం పురుషోత్తం రావు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఈ సమావేశాలకు ప్రత్యేక పర్యవేక్షకులుగా టీపీసీసీ నాయకులు కోటిం వినయ్ రెడ్డి, జగదీశ్వర్ రావు హాజరై బూత్ స్థాయి ఏజెంట్ల పనితీరుపై సమీక్ష నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డితో పాటు వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధారసింగ్ హాజరవుతారు.ఉదయం 09:30 గంటలకు, తాండూరు పట్టణం 11:00 గంటలకు బషీరాబాద్,12:30 గంటలకు, యాలాల్ లొ 02:30 గంటలకు, తాండూరు రూరల్, సాయంత్రం 04:00 గంటలకు, పెద్దేముల్ నియోజకవర్గంలోని ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు, బిఎల్ఎ లు, క్లస్టర్ ఇంచార్జీలు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు సమయానికి హాజరై ఈ సమావేశాలను జయప్రదం చేయాలని పురుషోత్తం రావు పిలుపునిచ్చారు.
Views: 20
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
21 Jul 2026 18:14:10
హైదరాబాద్: భారత్-యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం(సీఈటీఏ) అమలులోకి వచ్చిన సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో తెలంగాణ నుంచి యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే)కు వెళ్లే ఎగుమతి కంటైనర్లను అధికారికంగా...
