ఈనెల 6 నుండి శ్రీ కాళికా దేవి బోనాల ఉత్సవాలు.
- 9న బోనాల ఉత్సవాలు,10 న అమ్మవారి ఉత్సవ ఊరేగింపు.
- ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి,
- వెల్లడించిన ఆలయ ఈవో టి. నరేందర్.
తాండూరు (వికారాబాద్ జిల్లా) ఈనెల 6 నుండి పట్టణంలోనే శ్రీ కాళికాదేవి బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్నయని ఆలయ కార్యనిర్వాక అధికారి ఈవో టి నరేందర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో 9వ తేదీ ఆదివారం రోజున ఉ. 5-00 గం.లకు నుండి సుప్రభాతం, ఉ. 6-00 గం.లకు ఘటస్థాపన ఉ. గం. 7-05 ని.ల నుండి భజనమండలి వారిచే కాగ్ననది నుండి జలము తెచ్చుట,ఉ. గం. 7-30 ని.ల నుండి కాగ్ననది జలముతో అమ్మవారికి అభిషేకము ఉ. గం. 11-05 ని.లకు గంగాపూజకు బయలుదేరుట మధ్యాహ్నం 12 గంటలకు అమ్మవారి బోనాలు మధ్యాహ్నం 01 గంటలకు ముదిరాజ్ సంఘం వారిచే అన్నప్రసాద వితరణ,సా. గం 4-30 ని.లకు రంగం ఎక్కే కార్యక్రమం, పోతురాజు ఆట, కథాకాలక్షేపము కలదు. 10న సోమవారము రోజున ఉ. 6-00 గం.లకు నుండి పూజాకార్యక్రమము, కుంకుమార్చన జరుగును. ఉ. గం. 10-05 ని.ల నుండి శ్రీ లలితా సహస్రనామ పారాయణము,మధ్యాహ్నం 01 గంటలకు దేవస్థాన కిరాయిదారులచే అన్న ప్రసాద వితరణ,3-05 అమ్మవారి ఉత్సవసేవ - ఊరేగింపు జరుగుతుందని ఆలయ ఈవో తెలిపారు. ఇట్టి ఉత్సవాలలో స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రముఖులు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. కావున పట్టణంలోని భక్తులు అధిక సంఖ్యలో ఈ ఉత్సవాలలో పాల్గొని శ్రీ కాళికా దేవి మాత అమ్మవారిని దర్శించుకుని ఉత్సవాలను విజయవంతం చేయవలసిందిగా కోరారు.
Views: 32
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
04 Aug 2026 18:44:58
మందమర్రి, (మంచిర్యాల) : జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు,ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలలో వేగం పెంచి అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందేలా సమన్వయంతో కృషి చేయాలని...
