తాండూరు బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ శ్రీశైల్ రెడ్డి .
తాండూర్‌లో బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ సమీక్ష.. 71శాతం డిజిటలైజేషన్ పూర్తి.
తాండూరు (వికారాబాద్ జిల్లా) ఎకరాల్లో భూములు కొని.. బకరాలకు గజాల్లో అమ్మడం ఆపేసి ఎస్ ఐ ఆర్ పై దృష్టి పెట్టండి అంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి తాండూర్ ఎమ్మెల్యేకు బహిరంగంగా సూచించాల్సిన పరిస్థితి వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ పనితీరు ఏ విధంగా ఉందో ప్రజలు గమనించాలని తాండూర్ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ శ్రీశైల్ రెడ్డి పంజుగుల అన్నారు. మంగళవారం తాండూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ క్యాంప్ కార్యాలయంలో శ్రీశైల్ రెడ్డి పంజుగుల అధ్యక్షతన ఎస్ఐ ర్ పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాండూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పిలుపు మేరకు ఎస్ ఐ ఆర్ పై సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ బీఎల్‌ఏలు ఎంతో ఉత్సాహంగా పనిచేస్తున్నారని చెప్పారు. ఆర్డీవో లెక్కల ప్రకారం నియోజకవర్గంలో దాదాపు 71 శాతం డిజిటలైజేషన్ పూర్తయిందని, మిగిలిన ప్రక్రియను కూడా వేగంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. తాండూర్ పట్టణంలో బోగస్ ఓట్లు, డబుల్ ఓట్లు, మృతుల ఓట్లు, ఇతర ప్రాంతాలకు షిఫ్ట్ అయిన ఓట్ల పరిశీలన ఎక్కువగా ఉండటంతో ప్రక్రియ కొంత ఆలస్యమవుతోందని శ్రీశైల్ రెడ్డి తెలిపారు. మిగిలిన ఆరు రోజుల గడువులో పార్టీ శ్రేణులు మరింత అప్రమత్తంగా పనిచేస్తున్నాయని, నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో చురుగ్గా పాల్గొంటున్నారని తెలిపారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాస్వామ్య ప్రక్రియపై విశ్వాసంతో బీఆర్ఎస్ పనిచేస్తుందన్నారు. పార్టీ అధిష్టానం, మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకు ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో పార్టీ శ్రేణులు పాల్గొంటున్నాయని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఎస్ ఐ ఆర్ ప్రక్రియ పకడ్బందీగా జరగాలన్న కేసీఆర్ ఆలోచన మేరకు పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికీ ఎన్యుమరేషన్ ఫామ్‌లు తిరిగి ఇవ్వని వారు వెంటనే అందజేయాలని తాండూర్ ప్రజలను కోరారు. తాండూర్‌లో కాకుండా ఇతర ప్రాంతాల్లో ఓటు ఉన్నవారు అక్కడి ఓటును రద్దు చేయించుకుని తాండూర్‌లోనే ఓటు పొందాలని సూచించారు. మిగిలిన గడువును సీరియస్‌గా తీసుకుని ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు శ్రీశైల్ రెడ్డిపంజుగుల పిలుపునిచ్చారు. ఈ సమీక్షా సమావేశంలో నియోజకవర్గ సీనియర్ నాయకులు, మండల అధ్యక్షులు, కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
Views: 4
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
04 Aug 2026 18:44:58
మందమర్రి, (మంచిర్యాల) : జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు,ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలలో వేగం పెంచి అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందేలా సమన్వయంతో కృషి చేయాలని...
