అథ్లెటిక్స్ పోటీల్లో సత్తా చాటిన ఆదర్శ పాఠశాల విద్యార్థి 

అథ్లెటిక్స్ పోటీల్లో సత్తా చాటిన ఆదర్శ పాఠశాల విద్యార్థి 

కుల్కచర్ల, వికారాబాద్: తమ పాఠశాలకు చెందిన అరుణ్ కుమార్ అనే విద్యార్థి జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో సత్తా చాటినట్లు ముజాహిద్ పూర్ ఆదర్శ పాఠశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. గత రెండు రోజుల క్రితం తాండూర్ పట్టణంలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో అరుణ్ కుమార్ పాల్గొని లాంగ్ జంప్ లో ప్రథమ స్థానం, జావెలిన్ త్రోలో ద్వితీయ స్థానం , రన్నింగ్ లో ద్వితీయ స్థానంలో నిలిచినట్లు ప్రిన్సిపల్ చెప్పారు. జిల్లా స్థాయి పోటీల్లో సత్తా చాటి రాష్ట్ర స్థాయికి ఎంపికైనాడు. వరంగల్ లో జరిగే రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో తమ పాఠశాల విద్యార్థి పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థిని అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల పీఈటీ క్రిష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో వేగం పెంచాలి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో వేగం పెంచాలి
మందమర్రి, (మంచిర్యాల) : జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు,ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలలో వేగం పెంచి అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందేలా సమన్వయంతో కృషి చేయాలని...
మూడు నెలల రేషన్ కోటాను సజావుగా పంపిణీ చేయాలి
తాండూర్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులకు సన్మానం.
నాన్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం
చక్రియాల్‌లో హరితహారం వన మహోత్సవం ఘనంగా నిర్వహణ
తాండూరు బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్  శ్రీశైల్ రెడ్డి .
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు గడ్డపై టిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం.