వరంగల్ జిల్లా ప్రగతి పై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వరంగల్ ఎంపీ కావ్య
On
వరంగల్ జిల్లా అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ, పారిశ్రామిక ప్రగతి పై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య..
వరంగల్ జిల్లా అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ, పారిశ్రామిక ప్రగతికి సంబంధించి వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య లోక్‌సభలో ప్రశ్నించారు. పీఎం గతిశక్తి, ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్, ఇతర కేంద్ర పథకాల కింద వరంగల్‌కు ప్రత్యేక అభివృద్ధి ప్రణాళిక ఉందా? ఉంటే ఏయే ప్రాజెక్టులు మంజూరయ్యాయి? వాటి ద్వారా జిల్లాకు ఎలాంటి ప్రయోజనాలు కలగనున్నాయో వెల్లడించాలని కేంద్ర ప్రభుత్వాన్ని వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య కోరారు..
వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. వరంగల్ జిల్లాలో కనెక్టివిటీ మెరుగుపర్చేందుకు సుమారు ₹7,843 కోట్ల వ్యయంతో 447 కిలోమీటర్ల మేర మూడు రైల్వే ప్రాజెక్టులు, ₹6,133 కోట్ల వ్యయంతో 185 కిలోమీటర్ల మేర నాలుగు జాతీయ రహదారి ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. అలాగే పీఎం మిత్ర పథకం కింద 1,327 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న బ్రౌన్‌ఫీల్డ్ టెక్స్‌టైల్ పార్క్‌కు సుమారు ₹1,696 కోట్ల వ్యయం కేటాయించినట్లు పేర్కొంది..
ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య మాట్లాడుతూ,..
"వరంగల్ అభివృద్ధికి సంబంధించి కేంద్రం వద్ద ఉన్న ప్రణాళికలు, నిధుల కేటాయింపులు, అమలులో ఉన్న ప్రాజెక్టులపై స్పష్టత కోరినట్లు వెల్లడించారు. రైల్వే, జాతీయ రహదారులు, టెక్స్‌టైల్ పార్క్ వంటి ప్రాజెక్టులు పూర్తయితే జిల్లాలో పారిశ్రామిక వృద్ధి, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి" అని ఎంపీ తెలిపారు.
అలాగే, "వరంగల్‌కు మంజూరైన ప్రాజెక్టులు వేగంగా పూర్తయ్యేలా కేంద్రంపై నిరంతరం ఒత్తిడి తీసుకువస్తానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అభివృద్ధి పనులు కాగితాలకే పరిమితం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది అని కడియం కావ్య పేర్కొన్నారు..
Views: 17
About The Author

Tags:

Error on ReusableComponentWidget
Latest News
19 Sep 2026 13:53:01
ప్రజలకు అవసరమైన సేవలందించేందుకు అధికారుల సమన్వయంతో కార్యక్రమం
