కొండపాకలో ఘనంగా పోచమ్మ బోనాల ఉత్సవం

కొండపాకలో ఘనంగా పోచమ్మ బోనాల ఉత్సవం

కొండపాక/సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలో ముదిరాజ్ కులస్తుల ఆధ్వర్యంలో శ్రీ పోచమ్మ తల్లి బోనాల మహోత్సవం సోమవారం అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో కొండపాక మండల తాజా మాజీ జడ్పీటీసీ శ్రీమతి అనంతుల అశ్విని ప్రశాంత్ పాల్గొని, అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని వేడుకున్నారు. తమ ఆహ్వానాన్ని మన్నించి ఉత్సవానికి విచ్చేసిన తాజా మాజీ జడ్పీటీసీ అనంతుల అశ్విని ప్రశాంత్‌ను ముదిరాజ్ కుల పెద్దలు, సంఘ సభ్యులు ఘనంగా శాలువాతో సత్కరించి, గౌరవించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కులసంఘం నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
 
 
 
Views: 150

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో వేగం పెంచాలి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో వేగం పెంచాలి
మందమర్రి, (మంచిర్యాల) : జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు,ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలలో వేగం పెంచి అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందేలా సమన్వయంతో కృషి చేయాలని...
మూడు నెలల రేషన్ కోటాను సజావుగా పంపిణీ చేయాలి
తాండూర్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులకు సన్మానం.
నాన్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం
చక్రియాల్‌లో హరితహారం వన మహోత్సవం ఘనంగా నిర్వహణ
తాండూరు బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్  శ్రీశైల్ రెడ్డి .
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు గడ్డపై టిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం.