బాధితులకు న్యాయం చేయాలని ఆదివాసీ సంఘాల డిమాండ్ 

 బాధితులకు న్యాయం చేయాలని ఆదివాసీ సంఘాల డిమాండ్ 

ఉట్నూర్ : మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందనపల్లి శివారులో నదికి చేపల వేటకు వెళ్లిన ఆదివాసి యువకులు కృష్ణ, అనిల్, విష్ణులపై అటవీ శాఖ అధికారులు దాడి చేశారంటూ ఆదివాసీ విద్యార్థి సంఘం, తెలంగాణ సామాజిక స్టూడెంట్ ఆర్గనైజేషన్, తుడుందెబ్బ సంఘాలు ఆరోపించాయి. వైరల్ వీడియోపై సమగ్ర, నిష్పాక్షిక విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. బాధితులకు రక్షణ, వైద్య, న్యాయ సహాయం అందించాలని, ఆదివాసుల రాజ్యాంగబద్ధమైన సంప్రదాయ హక్కులను పరిరక్షించాలని ప్రభుత్వాన్ని కోరాయి. సిడాం జంగుదేవ్ పటేల్ రాష్ట్ర అధ్యక్షులు ఆదివాసీ విద్యార్థి సంఘం, జాడి వెంకటేష్ నేత, మంగం దీపక్, పెందుర్ త్రిమూర్తి, జంగు సిడాం పవన్,  అర్జున్ తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో వేగం పెంచాలి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో వేగం పెంచాలి
మందమర్రి, (మంచిర్యాల) : జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు,ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలలో వేగం పెంచి అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందేలా సమన్వయంతో కృషి చేయాలని...
మూడు నెలల రేషన్ కోటాను సజావుగా పంపిణీ చేయాలి
తాండూర్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులకు సన్మానం.
నాన్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం
చక్రియాల్‌లో హరితహారం వన మహోత్సవం ఘనంగా నిర్వహణ
తాండూరు బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్  శ్రీశైల్ రెడ్డి .
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు గడ్డపై టిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం.