జేఎన్టీయూహెచ్ సుల్తాన్‌పూర్‌లో "యాంత్రిక విజ్ఞాన వేదిక" ఘన ప్రారంభం

జేఎన్టీయూహెచ్ సుల్తాన్‌పూర్‌లో

చౌటకూర్  :సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం సుల్తాన్‌పూర్‌  జేఎన్టీయూహెచ్ (JNTUH) యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, సుల్తాన్‌పూర్‌లోని మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో సోమవారం "యాంత్రిక విజ్ఞాన వేదిక" (ఎటర్నల్ మెకానికల్ ఇంజనీర్స్ క్లబ్)ను ఘనంగా ప్రారంభించారు. ఈ వేదిక ద్వారా విద్యార్థులకు సాంకేతిక సదస్సులు, నిపుణుల ఉపన్యాసాలు, పారిశ్రామిక సందర్శనలు, వర్క్‌షాప్‌లు, డిజైన్ పోటీలు, ప్రాజెక్ట్ ప్రదర్శనలు మరియు నూతన ఆవిష్కరణలకు సంబంధించిన వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. విశ్వనాథ్ రాజు మాట్లాడుతూ, విద్యార్థులు పాఠ్యాంశాలతో పాటు ప్రాక్టికల్ పరిజ్ఞానం, పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలను అలవర్చుకోవడంలో ఇటువంటి వేదికలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. రాఘవేందర్ రావు మాట్లాడుతూ, విద్యార్థుల్లో సాంకేతిక ఆలోచనా విధానం, సమస్యల పరిష్కార సామర్థ్యాలను పెంపొందించడంలో ఇలాంటి క్లబ్‌లు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. తరగతి గది విద్యతో పాటు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను కూడా పెంపొందించుకోవాలని ఆయన సూచించారు.మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి (హెచ్‌ఓడీ) డా. శైలజ మాట్లాడుతూ, విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాలు, సృజనాత్మకత, పరిశోధనా దృక్పథం మరియు నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ఈ వేదికను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ క్లబ్ ద్వారా విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించడానికి, నూతన ఆవిష్కరణలకు మంచి ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మెకానికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన అధ్యాపకులు, సిబ్బంది మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
 
 
Views: 6

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో వేగం పెంచాలి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో వేగం పెంచాలి
మందమర్రి, (మంచిర్యాల) : జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు,ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలలో వేగం పెంచి అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందేలా సమన్వయంతో కృషి చేయాలని...
మూడు నెలల రేషన్ కోటాను సజావుగా పంపిణీ చేయాలి
తాండూర్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులకు సన్మానం.
నాన్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం
చక్రియాల్‌లో హరితహారం వన మహోత్సవం ఘనంగా నిర్వహణ
తాండూరు బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్  శ్రీశైల్ రెడ్డి .
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు గడ్డపై టిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం.