మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు.....జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

WhatsApp Image 2026-02-10 at 4.28.41 PM

 

వనపర్తి : ఫిబ్రవరి 11న వనపర్తి జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో నిర్వహించనున్న పోలింగ్ లో ఓటర్లు తమ ఓటు ను ఖచ్చితంగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి కోరారు. మంగళవారం వనపర్తి మున్సిపాలిటీకి సంబంధించి నర్సింగాయపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో  ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని, పెబ్బేరు మున్సిపాలిటీ కి సంబంధించి ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్ కళాశాల, కొత్తకోట మున్సిపాలిటీ కి సంబంధించి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణాల్లో ఏర్పాటు చేసిన  డిస్ట్రిబ్యూషన్,  అక్కడే ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. 
పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ తో పాటు ఎన్నికల రోజు సాయంత్రం రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు సైతం పకడ్బందీగా ఉండాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ పౌరులకు  రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ఓటరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.   ఎన్నికలు  పారదర్శకంగా, ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో  నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.  
ప్రతి మున్సిపాలిటీ, పోలింగ్ కేంద్రంలో గట్టి పోలీస్ భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బుధవారం ఉదయాన్నే 7.00 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5.00 గంటలకు ముగుస్తుందని, సాయంత్రం 5.00 గంటల లోపు పోలింగ్ కేంద్రంలో ఉన్న ప్రతి ఓటరుకు ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.  ఓటు వేయడానికి ఓటరు స్లిప్ తో పాటు ఎన్నికల కమిషన్ గుర్తించిన 17 రకాల గుర్తింపు కార్డులలో ఏదో ఒక గుర్తింపు కార్డు తప్పకుండా వెంట తీసుకురావాల్సి ఉంటుందని, గుర్తింపు కార్డు తీసుకురాని ఓటర్లకు ఓటు వేసేందుకు అవకాశం కల్పించబడదనే విషయాన్ని ప్రతి ఓటరు గుర్తించాలని సూచించారు.  వనపర్తి జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లోని 80 వార్డులలో 1,17, 441 మంది ఓటర్లు ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రతి పోలింగ్ కేంద్రంలో సి.సి కెమెరాలు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో (మైక్రో అబ్జర్వర్లు) సూక్ష్మ పరిశీలకులను నియమించినట్లు తెలిపారు. వనపర్తిలోని 33 వార్డుల్లో 64,190 మంది ఓటర్లు, పెబ్బేరులోని 12 వార్డుల్లో 14,333, కొత్తకోట లోని 15 వార్డుల్లో 18,192 ఓటర్లు, ఆత్మకూరు 10 వార్డుల్లో 11,579 ఓటర్లు,  అమర్చింత మున్సిపాలిటీలోని 10 వార్డుల్లో 9,147 మంది ఓటర్లకు    191పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని  తెలిపారు. పోలింగ్ సిబ్బంది  20 శాతం రిజర్వు సిబ్బందితో కలుపుకొని 230 మంది ప్రిసైడింగ్ అధికారులు, 230 మంది సహాయ ప్రిసైడింగ్ అధికారులు, 687మంది ఒ.పి.ఓ లను నియమించినట్లు తెలిపారు. వీరితో పాటు పోలీస్ సిబ్బంది, రూట్ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది సైతం విధులు నిర్వహించనున్నారు.ఎన్నికల సాధారణ పరిశీలకులు జి. లక్ష్మీ బాయి, వ్యయ పరిశీలకులు శ్రీనివాసులు, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్ ఖీమ్య నాయక్, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత తహశీల్దార్లు, ఎంపీడీఓ లు డిస్ట్రిబ్యూషన్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

WhatsApp Image 2026-02-10 at 4.28.42 PM

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

7కేజీల గంజాయి పట్టివేత.. 7కేజీల గంజాయి పట్టివేత..
    ఖమ్మం  :  మొండికుంట నుండి అశ్వాపురం మార్గం లో ద్విచక్ర వాహనం పై తరలిస్తున్న  7 కేజీ ల  గంజాయి  తరలిస్తూ ఉండగా ఎన్ఫోర్స్మెంట్ టీం
ముగిసిన ఎన్ ఎస్ ఎస్ శీతాకాల ప్రత్యేక శిబిరం.
ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది.. బాధ్యులపై ఉక్కుపాదం తప్పదు! మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
పేదలకు ఉచిత వైద్య సేవలు అందించడమే లైన్స్ క్లబ్ లక్ష్యం
టీబీ వ్యాధిపై రోగులకు ఎక్స్ రే క్యాంపు
శ్రీశ్రీశ్రీ తిక్క వీరేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు(జాతర)
మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు.....జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి