4వ వార్డు ఎంఐఎం అభ్యర్థిగా సయ్యద్ షబ్బీర్ హుస్సేన్ పోటీ

WhatsApp Image 2026-01-21 at 3.39.26 PM

 

వికారాబాద్ : వికారాబాద్ మున్సిపల్ పరిధిలో గల శివారెడ్డి పెట్ కు సంబంధించిన 4వ వార్డు నుండి ఎంఐఎం అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉంటారని శివారెడ్డిపేట జామియా మసీదు అధ్యక్షుడు మహమ్మద్ ఫఖ్రుద్దీన్ అన్నారు. ప్రతి రాజకీయ నేత టికెట్ సాధన దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.ఈ నేపథ్యంలో వికారాబాద్ మున్సిపల్ పరిధిలో గల శివారెడ్డిపేట వార్డు నంబర్–4 నుంచి మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) అభ్యర్థిగా సయ్యద్ షబ్బీర్  హుస్సేన్ పేరును స్థానిక ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బుధవారం శివారెడ్డిపేట, వికారాబాద్‌లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో శివారెడ్డిపేట జామియా మసీదు అధ్యక్షుడు మహమ్మద్ ఫఖ్రుద్దీన్ మాట్లాడుతూ, స్థానిక ప్రజల పరస్పర ఐక్యతతో సయ్యద్ షబ్బీర్ హుస్సేన్‌ను అభ్యర్థిగా నిలిపినట్లు తెలిపారు. ప్రజలు భారీ మెజార్టీతో ఎంఐఎం నిర్ణయించిన అభ్యర్థిని గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
అలాగే విజయం సాధించిన అనంతరం మహిళలు, పిల్లల విద్య, ఉపాధి, సంక్షేమ కార్యక్రమాల కోసం సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పారు.ఈ సందర్భంగా సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ మీడియాతో మాట్లాడుతూ, తాము రాజకీయాల్లోకి వచ్చినది ఎలాంటి ఆర్థిక లాభాల కోసం కాదని, ప్రజాసేవ లక్ష్యంతోనే ముందుకు వచ్చామని అన్నారు. తమ అభ్యర్థిని గెలిపించి ప్రజలకు సేవ చేసే అవకాశం ఇవ్వాలని కోరారు. శివారెడ్డిపేట మాజీ కో-ఆప్షన్ మెంబర్ మహమ్మద్ హాషిమ్ హుస్సేన్ మాట్లాడుతూ, యువతకు ప్రజాసేవ చేసే అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో సయ్యద్ షబ్బీర్ హుస్సేన్‌ను ఎంపిక చేశామని తెలిపారు. యువ నాయకత్వానికి మద్దతుగా నిలిచి ఆయనకు ఓటు వేయాలని ప్రజలను కోరారు.మహమ్మద్ నజీర్ హుస్సేన్ మాట్లాడుతూ, శివారెడ్డిపేట, వికారాబాద్ ప్రజలు పరస్పర ఐక్యతతో సయ్యద్ షబ్బీర్ హుస్సేన్‌ను ఎంఐఎం అభ్యర్థిగా ఏకగ్రీవంగా నిర్ణయించారని, ఆయనకు సంపూర్ణ ప్రజా మద్దతు ఉందని పేర్కొన్నారు.
మాజీ కార్పొరేటర్ ప్రతినిధి మహమ్మద్ షరీఫ్ మాట్లాడుతూ, తాను తన భార్య అనేక సంవత్సరాలుగా ఎంఐఎం కోసం పనిచేశామని, ప్రజల నమ్మకాన్ని ఎల్లప్పుడూ గౌరవించామని అన్నారు. ఈసారి యువ నాయకుడు సయ్యద్ షబ్బీర్ హుస్సేన్‌ను ఎంపిక చేశామని, పార్టీ సిద్ధాంతాలు, నియమావళి ప్రకారం పనిచేస్తూ శివారెడ్డిపేట సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయనకు తమ పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. మీడియా ప్రశ్నకు సమాధానంగా, ఎలాంటి ఒత్తిడి లేదా భయానికి లోనుకాకుండా పరస్పర ఐక్యతతోనే అభ్యర్థిని ఎంపిక చేసినట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా దర్గాహ్ కమిటీ, మసీదు కమిటీ, ఆశూరాఖానా కమిటీలు కూడా ఏకగ్రీవంగా తమ మద్దతును ప్రకటించాయి.
ఈ కార్యక్రమంలో సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, మహమ్మద్ ఫఖ్రుద్దీన్ (శివారెడ్డిపేట జామియా మసీదు అధ్యక్షుడు), షేక్ మహమ్మద్ ఖాదర్ అలీ, మహమ్మద్ నజీర్ హుస్సేన్, మహమ్మద్ అజీముద్దీన్, మహమ్మద్ హాషిమ్ హుస్సేన్ (మాజీ కో-ఆప్షన్ మెంబర్), మహమ్మద్ జమీర్ హుస్సేన్, మహమ్మద్ షరీఫ్ (మాజీ కార్పొరేటర్ ప్రతినిధి), మహమ్మద్ అబ్దుర్ రషీద్, మహమ్మద్ అజ్మత్ అలీ సూఫీ, మహమ్మద్ అబ్దుర్ రజాక్ (ఆర్టీసీ), మహమ్మద్ అన్వర్ హుస్సేన్, మహమ్మద్ రహ్మత్ అలీ, మహమ్మద్ నవాజ్, షేక్ మహమ్మద్ ఇర్ఫాన్ అలీ, మహమ్మద్ అన్వర్ అలీ, మహ్మూద్ ఖాన్, నయీమ్ుద్దీన్, మహమ్మద్ బద్రుద్దీన్, మహమ్మద్ ఇక్బాల్ (వెల్డర్), మహమ్మద్ అన్వర్ (ఉపాధ్యక్షుడు), మహమ్మద్ మహ్మూద్ ఖురేషీ, మహమ్మద్ జమీర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

Views: 13

About The Author

Vision Andhra Telugu Daily Picture

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ప్రశాంతమైన వాతావరణంలో పండగ జరుపుకోవాలి.  బిజెపి నాయకులు చిలకముడి రవి కిరణ్. ప్రశాంతమైన వాతావరణంలో పండగ జరుపుకోవాలి. బిజెపి నాయకులు చిలకముడి రవి కిరణ్.
        అనంతగిరి  : ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని బిజెపి నాయకులు చిలకముడి రవి కిరణ్ అన్నారు. అనంతగిరి మండలం అమీనాబాద్ గ్రామంలో ఈనెల 8వ తేదీన
24 గంటల్లో ఛేదించిన దుండిగల్ వృద్ధ మహిళ హత్య కేసు
వృత్తి శిక్షణా కోర్సుల తరగతులను పరిశీలించిన డీజిఎం - ఎస్ అనిల్ కుమార్
చట్టబద్ధంగానే ఇళ్ళ స్వాధీనం: కార్యనిర్వహణాధికారిణి లావణ్య ..
ఒకే వార్డులో అన్నదమ్ముల పోటీ…
క్రీడలు మానసికోల్లాసానికి దోహదపడతాయి. పర్వతగిరి ఎంపీడీవో మాలోత్ శంకర్ నాయక్. పర్వతగిరి సి.ఐ బి.రాజగోపాల్.
ప్రభుత్వ విద్యను ప్రోత్సహించాలి