గణిత దినోత్సవం సందర్భంగా విద్యార్థుల ప్రతిభా ప్రదర్శనలు

విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి : ప్రిన్సిపల్ జి ప్రమీల

IMG-20251223-WA0077

 

మర్పల్లి  : గణితం దైనందిన జీవితంలో కీలకమైన శాస్త్రమని,విద్యార్థులు గణితంపై ఆసక్తి పెంపొందించుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ ప్రమీల విద్యార్థులకు సూచించారు. మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల కళాశాల లో మంగళవారం జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకుని  ప్రత్యేక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా క్రిస్మస్ పండుగ వేడుకలను విద్యార్థులతో జరుపుకున్నారు. సాంస్కృతిక నాట్యం పాటలను ఎంతో చక్కగా ప్రదర్శించారు.ప్రతి సంవత్సరం డిసెంబర్ 22న భారతదేశ గొప్ప గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతిని జాతీయ గణిత దినోత్సవంగా  
విద్యార్థులు జరుపుకుంటారు. గణిత ప్రతిజ్ఞతో అసెంబ్లీని ప్రారంభించారు. అనంతరం మాథ్స్ ఫేర్, గణిత రంగవల్లులు, స్పెల్  బి నెంబర్లతో ఆటలు,క్విజ్ పోటీలు, గణిత మోడల్ ప్రదర్శనలు వంటి ఆకర్షణీయ కార్యక్రమాల ద్వారా తమ ప్రతిభను చాటుకున్నారు. 
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రమీల మాట్లాడుతూ,  విద్యార్థులు గణితంలో పట్టు సాధించాలంటే ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేయాలని అప్పుడే గణితంపై పట్టు సాధిస్తారని విద్యార్థులకు సూచించారు. గణితం మన జీవితంలో ఎంతో కీలక పాత్ర పోషించడంతో విద్యార్థులు గణితంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. విద్యార్థులు చదువుతోపాటు కలలపై దృష్టి సారించి వాటిని నేర్చుకోవాలి అన్నారు. క్రమశిక్షణతో కూడిన చదువు భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులు చేసిన సాంస్కృతి కార్యక్రమాలు ఎంతో ఆకర్షించాయన్నారు. ఈ కార్యక్రమంలో గణిత బోధన ఉపాధ్యాయులు నర్సింలు, కల్పన ,నవీన్ కుమార్, ఉపాధ్యాయ బృందం మరియు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

Views: 10

About The Author

Vision Andhra Telugu Daily Picture

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Tags:

Related Posts

Error on ReusableComponentWidget

Latest News

అధికారుల సహకారంతోనే జిల్లా సమగ్రాభివృద్ధికి శక్తియులా కృషి చేశా...  అధికారుల సహకారంతోనే జిల్లా సమగ్రాభివృద్ధికి శక్తియులా కృషి చేశా...
    అక్కున చేర్చుకున్న కరీంనగర్ ను కన్న ఊరులా ఎప్పటికీ మర్చిపోలేను... కరీంనగర్ : జిల్లా కలెక్టర్గా అభివృద్ధి చేసే గొప్ప అవకాశాన్ని కరీంనగర్ ఇచ్చిందని,  కన్న
ఏఐ సాంకేతికత వెనుక దాక్కోవడం సిగ్గుచేటు -- మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య
తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గా ఎండి రహీం
శంకరపట్నం మండల ఆర్ఎంపీల అసోసియేషన్ అధ్యక్షునిగా సాంబయ్య...
పట్టా భూమి కబ్జాకు యత్నం - అధికారులు ఆదుకోని న్యాయం చేయాలి
ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి ----- మున్సిపల్ ఛైర్ పర్సన్ బండారి అనూష సతీశ్ .
రైతులు పండించిన పంట రైతుకే దక్కాలి వైరా ఎమ్మెల్యే