కొండగట్టు అంజన్న ఆలయంలో వరుణ జపం
జగిత్యాల/మల్యాల: మండలం కొండగట్టులో ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు తొలగి సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ, దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో మంగళవారం ఉదయం స్థానాచారి కపిందర్, ప్రధాన అర్చకులు రామకృష్ణ, ఉప ప్రధాన అర్చక చిరంజీవి ,మారుతి ప్రసాద్, చిన్న రాము వేద పండితులు రాజేశ్వర శర్మ ,పెద్దన్న శర్మ ,తేజ శర్మ ఆధ్వర్యంలో వైభవంగా వరుణ జపం, వరుణ యాగం నిర్వహించారు.ఈ సందర్భంగా శ్రీ ఆంజనేయస్వామి వారికి విశేష అభిషేకం నిర్వహించి, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, రైతులకు అనుకూలంగా సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని వేద మంత్రోచ్చారణల మధ్య వరుణ జపం, వరుణ యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎస్. అంజనారెడ్డి, సహాయ కార్యనిర్వహణాధికారి హరిహారనాథ్, సూపరింటెండెంట్లు సునీల్, చంద్రశేఖర్‌తో పాటు ఆలయ అర్చకులు, వేద పండితులు, సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.
Views: 51
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
21 Jul 2026 18:14:10
హైదరాబాద్: భారత్-యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం(సీఈటీఏ) అమలులోకి వచ్చిన సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో తెలంగాణ నుంచి యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే)కు వెళ్లే ఎగుమతి కంటైనర్లను అధికారికంగా...
