భృంగి ఎంక్లేవ్ లో ఘనంగా గణతంత్ర వేడుకలు

వికారాబాద్ : 2025 జనవరి 26 సోమవారం మనం 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని భృంగి ఎంక్లేవ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కుమారస్వామి అన్నారు. దేశంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. ప్రతిచోటా దేశభక్తి గీతాలు వినిపిస్తాయని ఆయన తెలిపారు. గణతంత్ర దినోత్సవం అంటే మన రాజ్యాంగ దినోత్సవానికి సంబంధించిన విషయం అని చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చని ఆయన సందేహం వ్యక్తం చేశారు. వాస్తవానికి మన రాజ్యాంగం జనవరి 26, 1950న అమలులోకి వచ్చిందని ఆయన వెల్లడించారు. అయితే భారత రాజ్యాంగం రెండు నెలల ముందుగానే పూర్తయిందన్న విషయం మీకు తెలుసా అని ఆయన జెండా వందనానికి వచ్చిన వారిని ప్రశ్నించారు. రెండు నెలలు ఎందుకు లేట్ అయిందో ఇప్పుడు తెలుసుకుందామని ఆయన అన్నారు. 26
నవంబర్ 1949న భారత రాజ్యాంగం ఆమోదం పొందింది అని ఆయన అన్నారు. భారతదేశానికి 15 ఆగస్టు 1947న స్వాతంత్య్రం వచ్చిందని తెలిపారు. 26 జనవరి 1950న రాజ్యాంగాన్ని స్వీకరించి.. ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా భారతదేశం మారిందన్నారు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, భారతదేశ రాజ్యాంగం నవంబర్ 26, 1949న పూర్తయినప్పటికీ అది అమలులోకి రావడానికి రెండు నెలలు పట్టిందని చెప్పారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి 2 సంవత్సరాలు 11 నెలల 18 రోజులు పెట్టిందన్నారు. భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్. భీమ్ రావ్ అంబేద్కర్ దీనిని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు.1930 జనవరి 26న లాహోర్ సమావేశంలో కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్ ప్రకటించిందని వివరించారు. ఆ పరిస్థితిలో 26 నవంబర్ 1949న రాజ్యాంగం ఏర్పడినప్పటికీ, జనవరి 26 కోసం ఎదురు చూశారని అన్నారు. ఎందుకంటే ఆ సమయంలో దీనిని లాహోర్ సమావేశ ప్రకటనతో అనుసంధానించాలని చూశారు. అందుకే 29 నవంబర్ 1949న రాజ్యాంగం ఏర్పడినా, 26 జనవరి 1950న అమలులోకి తెచ్చారు అని సుదీర్ఘంగా వివరించారు. ఈ కార్యక్రమంలో భృంగి ఎంక్లేవ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ముకుంద రెడ్డి, మీడియా ఆర్గనైజర్ పన్నాల రాజేందర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి ఆంజనేయులు, కోశాధికారి వెంకటేష్, ఈసి మెంబర్లు మధుసూదన్ రెడ్డి, నాగేష్, నాగార్జున రెడ్డి, గోపాల్, సత్యా రెడ్డి, సురేందర్ రెడ్డి, మాణిక్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
About The Author
Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.


