అతిరుద్ర మహా యజ్ఞ సప్తాహ మహోత్సవం

2026 జనవరి 25 ఆదివారం నుండి 31 శనివారం వరకు చిగుళ్ళపల్లి గ్రౌండ్ వికారాబాద్

WhatsApp Image 2026-01-22 at 5.29.22 PM

 

వికారాబాద్  : వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః  పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో శ్రీ మహాగణపతి శత చండీ రాజశ్యామల మహా సుదర్శన చతుర్వేద పారాయణ స్వాహాకార మహన్యాస పూర్వక సంతత ధారాభిషేక శాంతి కళ్యాణ సహిత అతిరుద్ర పారాయణ యుక్త కార్యక్రమము నిర్వహించబడునని వికారాబాద్ ఆధ్యాత్మిక సేవా మండలి అన్నారు. 2026 జనవరి 25 ఆదివారం నుండి 31 శనివారం వరకు చిగుళ్ళపల్లి గ్రౌండులో నిర్వహించబడునని తెలిపారు. గురువారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలో గల చిగుళ్ళపల్లి గ్రౌండులో అతిరుద్ర మహాయజ్ఞ సప్తాహ మహోత్సవం జరుగును. ప్రతీరిజు అఖండనామ సంకీర్తన, అఖండ భజన కార్యక్రమము అఖండ సంతత ధారాభిషేకము ప్రతిరోజు ప్రతి ఒక్కరికి శివున్ని అభిషేకించే అవకాశం కల్పించబడుతుంది. లలితా విష్ణు సహస్రనామ పారాయణం సాంస్కృతిక కార్యక్రమాలు రాత్రి 8 గంటల నుండి కొనసాగును. మహనీయుల అనుగ్రహ భాషణములు అన్నప్రసాద సేవ మధ్యాహ్నం ఒంటిగంట నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటుంది. ధర్మరక్షణలో భాగంగా చేపడుతున్న మహత్తర ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులు అందరూ తను, మన, ధన పూర్వకంగా భాగస్వాములై ఆ పార్వతీపరమేశ్వరుల అనుగ్రహానికి పాత్రులు కావాలని వారు ఆకాంక్షించారు. అతిరుద్ర మహాయజ్ఞ సప్తాహ కార్యక్రమం బ్రహ్మశ్రీ బాల మార్తాండ మహారాజ్ (సర్వతోముఖ యాజి ) ప్రభునగర్ పర్యవేక్షణలో జరుగును. ఈ కార్యక్రమానికి అతిముఖ్యులు శ్రీ మన్నిరంజన ప్రణవ స్వరూప డాక్టర్ చెన్న బసవ ప్రభు మహా స్వాములు ఆలంపల్లి దుధని కెంపిన మఠం పీఠాధిపతులు,  శ్రీ శ్రీ శ్రీ 1008 వైరాగ్య శిఖామణి 
అవధూత గిరి మహారాజ్ పీఠాధిపతులు 
శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమం బర్దిపూర్ ,  శ్రీ శ్రీ శ్రీ 1008 మహా మండలేశ్వర్ 
సిద్ధేశ్వరానందగిరి మహారాజ్ పీఠాధిపతులు 
శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమం బర్దిపూర్,  శ్రీ శ్రీ శ్రీ డాక్టర్ ఆదిత్య పరా శ్రీ స్వామి వారు 
శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం,  పూజ్యశ్రీ బిక్షమయ్య గురూజీ 
శ్రీ సత్య సాయి ధ్యాన మండలి విజయవాడ హాజరుకానున్నారు. మీడియా సమావేశంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్ళపల్లి రమేష్, తాండూరి రాజు, జ్యోషి సుభాష్ చంద్రకాంత్ శర్మ, భోగేష్ పంతులు, కవుకుంట్ల విజయ్, కజ్జం రామచంద్రయ్య, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Views: 11

About The Author

Vision Andhra Telugu Daily Picture

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

హమ్మయ్య ఇక్కడ హాయిగా ఉంది.! బస్ స్టాప్ ప్రయాణికుల ప్రాంగణంలో కార్ పార్కింగ్..! హమ్మయ్య ఇక్కడ హాయిగా ఉంది.! బస్ స్టాప్ ప్రయాణికుల ప్రాంగణంలో కార్ పార్కింగ్..!
    వనపర్తి : వనపర్తి జిల్లా ఏదుల మండల పరిధిలోని గొల్లపల్లి బస్టాప్ ప్రయాణికుల ప్రాంగణంలో ఏపీ 09 బి జెడ్ 0996 అనే నెంబర్ గల
పేట రోడ్ షోలో నిప్పులు చెరిగిన మంత్రి పొంగులేటి
క‌రీంన‌గ‌ర్ జిల్లా చొప్ప‌దండిలో “ప్రజా పాలన- ప్రగతి బాట” కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు….
ఫైబర్ నేరాలపైన అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించిన కళాబృందం: ఎస్ ఐ మహేందర్
హావగిర్ రావు దేశ్ ముఖ్ మరణం... కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు
త్రాగు నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి _ జిల్లా పంచాయతీ అధికారి షర్ఫుద్దీన్
వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా: 28వ వార్డు ఇండిపెండెంట్ కౌన్సిలర్ అభ్యర్థి నీరోజీ శ్రావణి కవిరాజ్ కుమార్