సకాలంలో విద్యుత్ బిల్లులు చెల్లించాలి
స్టేషన్ ఘన్‌పూర్, (జనగామ) : వినియోగదారులు విద్యుత్ బిల్లుల బకాయిలను సకాలంలో చెల్లించి సంస్థకు తోడ్పాటు అందించాలని జిల్లా విద్యుత్ గణాంక అధికారి శంకర్ అన్నారు. బుదవారం పట్టణ కేంద్రంలోని విద్యుత్ ఈఆర్ఓ కార్యాలయంలో డిఈ బి సారయ్య అధ్యక్షతన ఘన్‌పూర్ మరియు పాలకుర్తి సబ్ డివిజన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్ఏఓ మాట్లాడుతూ విద్యుత్ అధికారుల పర్యవేక్షణలో రెవిన్యూ, ఆపరేషన్ అండ్ మెంటనెన్స్ సిబ్బంది సంయుక్తంగా పేరుకుపోయిన విద్యుత్ బకాయిలు రాబట్టేలా కృషి చేయాలని తెలిపారు. ఈకార్యక్రమంలో ఏడిఈ పి రణధీర్ రెడ్డి, శ్రీధర్, ఏఏఓ యాఖుబ్ పాషా, చంద్రశేఖర్, ఏఈలు శంకర్, శివకుమార్, సురేష్, కరుణాకర్, రణధీర్, కొమురయ్య, రాంబాబు, సబ్ ఇంజనీర్ సాధన, జేఏఓ అర్చన, జనార్ధన్, నాగేందర్, ఘన్‌పూర్, పాలకుర్తి సబ్ డివిజన్ పరిధిలోని స్పాట్ బిల్ రీడర్లు పాల్గొన్నారు.
Views: 345
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
05 Aug 2026 18:12:49
మందమర్రి, (మంచిర్యాల) : క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో ఒప్పంద పద్ధతిన పని చేస్తున్న కార్మికులకు పాత ప్రకారమే వేతనాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని మున్సిపల్ చైర్ పర్సన్...
