రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసన ఉట్నూర్ లో కాంగ్రెస్ ధర్నా

రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసన ఉట్నూర్ లో  కాంగ్రెస్ ధర్నా

నిర్మల్  : ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై జరిగిన దాడిని ఖండిస్తూ, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు ఉట్నూర్ మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఘటనతో విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతిన్నప్పటికీ, దానిపై సమగ్ర విచారణ చేపట్టకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం బాధాకరమని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో ప్రజాస్వామ్య విలువలు దెబ్బతింటున్నాయని ఆరోపించారు. విద్యార్థులకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తున్న రాహుల్ గాంధీపై దాడి చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, ఇటువంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తు న్నామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా, మండల, యూత్ కాంగ్రెస్ నాయకులు, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
 
Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పాత వేతనాలకై కృషి చేస్తా :  చైర్ పర్సన్ సంధ్యారాణి  పాత వేతనాలకై కృషి చేస్తా :  చైర్ పర్సన్ సంధ్యారాణి 
మందమర్రి, (మంచిర్యాల) : క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో ఒప్పంద పద్ధతిన పని చేస్తున్న కార్మికులకు పాత ప్రకారమే వేతనాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని మున్సిపల్ చైర్ పర్సన్...
చౌట్కూర్ ZPHSలో పరిశుభ్రత, ఆరోగ్య అలవాట్లపై అవగాహన సదస్సు
వరి సాగులో వేరు ముంచే పద్ధతిపై రైతులకు అవగాహన
హింసాత్మక రాజకీయాలకు కుట్రలు చేయడం సరికాదు.
బిజీనాపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత HPV టీకా
బోధన్ లో నీటి సరఫరాలో అంతరాయం.
హైవే రోడ్డుపై సీసీ కెమెరా ఏర్పాటు