విధి నిర్వహణలో మృతిచెందిన కానిస్టేబుల్ కుటుంబానికి రూ.కోటి బీమా చెక్కు అందజేత
బాధిత కుటుంబానికి అండగా ఉంటాం - ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్
నాగర్ కర్నూల్ : విధి నిర్వహణలో మృతిచెందిన ఏఆర్ కానిస్టేబుల్ రాజు కుటుంబానికి రూ.కోటి విలువైన బీమా చెక్కును జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్, ఐపీఎస్ అందజేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మృతుని కుటుంబ సభ్యులకు ఈ చెక్కును అందజేశారు.
గత ఆగస్టులో కొల్లాపూర్ లో సీఎం బందోబస్తు విధులు ముగించుకొని తిరిగి వస్తుండగా కానిస్టేబుల్ రాజు పిడుగుపాటుకు గురై మృతిచెందారు. ఎస్బీఐలో పోలీస్ శాలరీ ప్యాకేజ్ ఖాతా ఉండటంతో ఆయన కుటుంబానికి రూ.కోటి బీమా పరిహారం మంజూరైంది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, కానిస్టేబుల్ రాజు కుటుంబానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రతి పోలీస్ సిబ్బంది పోలీస్ శాలరీ ప్యాకేజ్ తో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, ఎస్బీఐ ప్రతినిధులు, మృతుని కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


