విజన్ ఆంధ్ర వార్త కథనానికి స్పందన
త్రికుటేశ్వర ఆలయానికి 350 ఎస్ ఎఫ్ టి గ్రానైట్ అందజేసిన హైదరాబాద్ వ్యాపారి వెంకటేష్ గౌడ్

పెన్‌పహాడ్ : మండల పరిధిలోని నాగులపహాడ్ గ్రామంలోని ప్రసిద్ధ త్రికుటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి వెంకటేష్ గౌడ్ 350 స్క్వేర్ ఫీట్ల గ్రానైట్‌ను దాతృత్వంగా అందజేశారు. ప్రత్యేకత ఏమిటంటే, స్వయంగా ఆలయానికి విచ్చేసి, ట్రస్ట్ సభ్యులు, గ్రామస్తుల సమక్షంలో ఈ గ్రానైట్‌ను ఆలయానికి అధికారికంగా అందజేశారు. ఆలయ అభివృద్ధి కోసం దాతలు ముందుకు రావడంలో సంకరమద్ది శ్రావణ్ రెడ్డి మరియు బూరుగు అంజయ్య గారు చొరవ తీసుకుని కీలక పాత్ర పోషించారని గ్రామస్తులు ప్రశంసించారు. ఇప్పటివరకు ఆలయ అభివృద్ధి నిమిత్తం మొత్తం 760 స్క్వేర్ ఫీట్ల గ్రానైట్‌ను వివిధ దాతలు సమర్పించడం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు దాతలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఆలయానికి మొత్తం 660 స్క్వేర్ ఫీట్స్ గ్రానైట్ రాగా, మిగతా గ్రానైట్ కు దాతలుగా హైదరాబాద్ గణేష్ నగర్ కు చెందిన శ్రావణ్ కుమార్ రెడ్డి స్నేహితులు ఫనిష్ 10వేల రూపాయలు, నవీన్ కుమార్ రెడ్డి అయిదు వేల రూపాయలు, కొండల్ యాదవ్ గారు 5000 రూపాయలు, సాయి రెడ్డి మరియు రాజి రెడ్డి గార్లు చెరో 5000 రూపాయల చొప్పున, కోట్ల రాజు 5000 రూపాయలు, గ్రామానికి చెందిన సంకరమద్ది ఋషి కుమార్ రెడ్డి, 5000 రూపాయలు, మనోజ్ రావు 5000 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సంకర మద్ది నిరంజన్ రెడ్డి,ట్రస్ట్ సభ్యులు బూరుగు అంజయ్య, శంకరమద్ది శ్రవణ్ రెడ్డి, కొండా జానకి రాములు గౌడ్, కొండ నాగయ్య, ఉత్సవ కమిటీ మాజీ చైర్మన్ పోగుల జానయ్య గౌడ్, 8వ వార్డు మెంబర్ కందుకూరి బక్కమ్మ–వెంకటయ్య, బూరుగు భద్రయ్య, రాయి వీరయ్య, తండ కృష్ణయ్య, నంద్యాల వెంకటరెడ్డి, శంకరమద్ది నాగిరెడ్డి తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.
దాతలకు కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు

About The Author
Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Related Posts

