న్యాయ ఫలాలు బాధితులకు అందేలా చూడాలి

IMG-20251221-WA0012

 

హుజూర్ నగర్ :  న్యాయాన్ని కోరుకుంటూ కోర్టులను ఆశ్రయించిన బాధితులకు తక్షణ న్యాయ సహాయం అందే విధంగా న్యాయవాదులు కృషి చేయాలని హుజూర్ నగర్ రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి రాధాకృష్ణ చౌహన్ న్యాయవాదులను కోరారు. ఆదివారం స్థానిక జిల్లా కోర్టు హాల్ నందు జరిగిన వీడ్కోలు సమావేశంలో ఆయన న్యాయవాదులను ఉద్దేశించి  మాట్లాడుతూ యువ న్యాయవాదులు అనునిత్యం అధునాతన న్యాయ గ్రంథాలను, న్యాయ శాస్త్రాలను, ఉన్నత న్యాయస్థానాలు వెలువరించే తీర్పులను నిరంతరం చదువుతూ న్యాయ విజ్ఞానం పెంపొందించుకోవాలని సూచించారు. హుజూర్ నగర్ కోర్టులో తను అతి కొద్ది కాలం పాటే పని చేసినప్పటికీ న్యాయవాదులు నాకు సహకరించిన తీరు ఈ ప్రాంత వాతావరణం ఎన్నటికీ మర్చిపోలేను అన్నారు. తన విధి నిర్వహణలో భాగంగా ఏదైనా సందర్భంలో కఠినంగా వ్యవహరించినట్లయితే అది వృత్తిపరమైన చర్య తప్ప వ్యక్తిగతం కాదన్నారు. తనకు అన్ని విధాలుగా సహకరించిన బార్ అసోసియేషన్ సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి మారుతి ప్రసాద్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఆయేషా సరీనా లు మాట్లాడుతూ తమకు   ఉద్యోగ పరంగా ఏదైనా సందేహం ఏర్పడినప్పుడు అదనపు జిల్లా న్యాయమూర్తి చేత నివృత్తి చేసుకునే వారమని ఉద్యోగ పరంగా వారు మాకు అనేక రకాలుగా సహకరించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. పలువురు సీనియర్, జూనియర్ న్యాయవాదులు మాట్లాడుతూ జిల్లా న్యాయమూర్తి కొద్ది కాలం పాటే ఇక్కడ పనిచేసినప్పటికీ తమలో ఒకడిగా మిళితమై పోయారని ప్రస్తుతం అతనిని వదిలి పెట్టుకోవడం తమకు ఇబ్బందిగా మారిందన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా త్వరలోనే పదోన్నతి పొంది తిరిగి తమ జిల్లాకు రావాలని ఆకాంక్షించారు. అనంతరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు అదనపు జిల్లా న్యాయమూర్తి దంపతులు రాధాకృష్ణ చౌహన్, డాక్టర్ జ్యోతి లను పూలమాలలు, బొకేలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధికార ప్రతినిధి కాల్వ శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి చనగాని యాదగిరి, ఉపాధ్యక్షులు జక్కుల నాగేశ్వరరావు, న్యాయవాదులు రవికుమార్, ధూళిపాల శ్రీనివాసరావు, నాగేష్ రాథోడ్, శ్రీవల్లి, కొట్టు సురేష్, శ్రీను నాయక్, వెంకటేష్ నాయక్, శంకర్ నాయక్, చక్రాల వెంకటేశ్వర్లు, మామిడి వెంకయ్య, మద్దుల నాగేశ్వరరావు, రామినేని వెంకటేష్, పిన్నపురెడ్డి వెంకటరెడ్డి, రమణారెడ్డి, ఎమ్మెస్ రాఘవరావు, ఏజీపీలు రేణుకా దేవి, సురేష్ కుమార్, దీపిక, సంధ్య, కుక్కడపు నరసింహారావు, ఒట్టికూటి అంజయ్య, అడవి రాముడు, బుడగ నరేష్, సైదా హుస్సేన్, చిట్టి పోతుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

 

Views: 14

About The Author

Vision Andhra Telugu Daily Picture

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Tags:

Related Posts

Error on ReusableComponentWidget

Latest News

అధికారుల సహకారంతోనే జిల్లా సమగ్రాభివృద్ధికి శక్తియులా కృషి చేశా...  అధికారుల సహకారంతోనే జిల్లా సమగ్రాభివృద్ధికి శక్తియులా కృషి చేశా...
    అక్కున చేర్చుకున్న కరీంనగర్ ను కన్న ఊరులా ఎప్పటికీ మర్చిపోలేను... కరీంనగర్ : జిల్లా కలెక్టర్గా అభివృద్ధి చేసే గొప్ప అవకాశాన్ని కరీంనగర్ ఇచ్చిందని,  కన్న
ఏఐ సాంకేతికత వెనుక దాక్కోవడం సిగ్గుచేటు -- మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య
తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గా ఎండి రహీం
శంకరపట్నం మండల ఆర్ఎంపీల అసోసియేషన్ అధ్యక్షునిగా సాంబయ్య...
పట్టా భూమి కబ్జాకు యత్నం - అధికారులు ఆదుకోని న్యాయం చేయాలి
ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి ----- మున్సిపల్ ఛైర్ పర్సన్ బండారి అనూష సతీశ్ .
రైతులు పండించిన పంట రైతుకే దక్కాలి వైరా ఎమ్మెల్యే