విద్యుత్ పోరాట అమరులకు ఘన నివాళి
లింగాల గణపురం (జనగాం): కళ్లెం గ్రామంలో జ్ఞాపకాలను స్మరించుకున్న సిపిఎం నాయకులువిద్యుత్ చార్జీల తగ్గింపుకై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన చలో అసెంబ్లీ ఉద్యమంలో అమరులైన పోరాట యోధులకు కళ్లెం గ్రామంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. అప్పటి ప్రభుత్వ హయాంలో విద్యుత్ చార్జీలను నిరసిస్తూ వామపక్షాలు, మిత్రపక్షాల పిలుపుమేరకు రాష్ట్ర నలుమూలల నుండి వేలాదిగా ప్రజలు హైదరాబాద్ తరలివచ్చారని గుర్తుచేశారు. ఆ సమయాన ప్రజా ఉద్యమాన్ని అణచివేసేందుకు అప్పటి ప్రభుత్వం లాఠీచార్జీలు, భాష్పవాయువు ప్రయోగాలు చేయించడమే కాకుండా, గుర్రాలతో తొక్కించి జరిపిన కాల్పుల్లో రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్‌లు అమరులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, నాటి ఉద్యమకారుల ప్రాణ త్యాగాల ఫలితంగానే నేడు మనకు 26 ఏళ్లుగా ఉచిత విద్యుత్ ఫలాలు అందుతున్నాయని కొనియాడారు. వారి త్యాగాలు ఎన్నటికీ విస్మరించలేనివని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల నాయకులు తూటి దేవదానం, శాఖ కార్యదర్శి అతియా సుల్తానా, సభ్యులు సిరిగిరి కిష్టయ్య, ముగ్గుపోషయ, తిప్పారపు కుమార్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


