జగన్ మోహన్ రావు కి రాఖీలు కట్టిన 47వ డివిజన్ ఆడబిడ్డలు
మంచిర్యాల టౌన్ రాఖీ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 47వ డివిజన్ కు చెందిన ఆడబిడ్డలు మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మంతెన జగన్ మోహన్ రావు మర్యాదపూర్వకంగా కలిసి రాఖీలు కట్టి, రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆడబిడ్డలు తమ సోదరుడిగా భావించి ఆత్మీయంగా రాఖీ కట్టగా, మంతెన జగన్ మోహన్ రావు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపి, అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. తమకు ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో 47వ డివిజన్ కు చెందిన కాంగ్రెస్ పార్టి నాయకులు దర్శనాల శ్రీనివాస్ తేజ . డివిజన్ సభ్యులు చౌడారపు శ్రీనివాస్ పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

