వెలగని వీధి దీపాలు – రాత్రివేళ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు
మంచిర్యాల టౌన్: మంచిర్యాల పట్టణంలోని అండలమ్మ కాలనీలో రాత్రి 8 గంటలు దాటినా వీధి దీపాలు వెలుగకపోవడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీధి దీపాలు పనిచేయకపోవడంతో రాత్రివేళ రాకపోకలు సాగించే ప్రజలు, మహిళలు, వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు.కాలనీలో పలు ప్రాంతాల్లో చీకటి నెలకొంటున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీధి దీపాలను వెంటనే మరమ్మతులు చేసి, రాత్రివేళ క్రమం తప్పకుండా వెలిగేలా చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరుతున్నారు. ఈ సమస్యపై MiM జనరల్ సెక్రటరీ సయ్యద్ ఇబ్నీ అఫాన్ స్పందిస్తూ, అండలమ్మ కాలనీలో వీధి దీపాల సమస్యను మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తక్షణమే సమస్య ను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

