బానిసత్వం నుండి విముక్తి కోసం అరుపు

కళ్ళ ముందు అన్యాయం జరిగినా మౌనం వదలని సమాజానికి స్వాతంత్ర్యం ఎక్కడ

బానిసత్వం నుండి విముక్తి కోసం అరుపు

కరీంనగర్, :  స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్లు అయినా ఇంకా కొందరు మానసిక బానిసలుగా బ్రతుకుతున్నారని సామాజిక కార్యకర్త కోట శ్యామ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఆయన విడుదల చేసిన సందేశంలో సమాజంలోని నిజాలను ఎత్తి చూపారు. కనుల ముందు అన్యాయాలు జరుగుతున్నా, అక్రమాలు జరుగుతున్నా, దోపిడీలు దొంగతనాలు జరుగుతున్నా మనకెందుకులే అని ప్రశ్నించకుండా మౌనంగా ఉంటున్నాం. చిన్న పిల్లల పై అత్యాచారాలు, హత్యలు జరిగినా పట్టించుకోకుండా తలదించుకుంటున్నాం" అని ఆయన అన్నారు. స్వాతంత్ర్యం అంటే కేవలం బ్రిటిష్ వారి నుండి విముక్తి మాత్రమే కాదని, ప్రతి పౌరుడు భయం లేకుండా, అన్యాయాన్ని ప్రశ్నించే హక్కుతో బ్రతకడమే అసలైన స్వాతంత్ర్యం అని కోట శ్యామ్ కుమార్ పేర్కొన్నారు.  అన్యాయాన్ని చూసి మాట్లాడలేక, అక్రమాలను ఎదిరించలేక బానిసలుగా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికీ నిజమైన స్వాతంత్ర్యం రావాలని ఆయన ఆకాంక్షించారు. సమాజంలో మార్పు రావాలంటే ప్రతి వ్యక్తి తన గొంతు వినిపించాలని, మౌనం వీడి ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
Views: 5

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

జీజీహెచ్ లో దేశభక్తి ఉప్పొంగేలా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జీజీహెచ్ లో దేశభక్తి ఉప్పొంగేలా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
నిజామాబాద్ : ​నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో (జీఎంసీ) 2026, ఆగస్టు 15న 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు మిక్కిలి దేశభక్తి, ఉత్సాహాల మధ్య ఘనంగా జరిగాయి....
ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
స్నేహ సొసైటీలో  ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు 
రైతుల పొలాలకు వ్యవసాయ అధికారులు
దేశ ఐక్యత, సమగ్రత కోసం పాటు పడాలి
మహనీయుల త్యాగాలు చిరస్మరణీయం
వెల్దుర్తిలోనే తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలి