అంగన్వాడిలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.
జాతీయ జెండాను ఆవిష్కరించిన వార్డు కౌన్సిలర్ డి శ్రీకాంత్ రెడ్డి.
తాండూరు, : తాండూరు పట్టణంలోని 33 వ వార్డు వడ్డెర గల్లి అంగన్వాడీ కేంద్రం-1లొ 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. శనివారం 15 ఆగస్టు స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని అంగన్వాడి కేంద్రంలో నిర్వహించిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో స్థానిక కౌన్సిలర్ డి శ్రీకాంత్ రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఎంతోమంది మహానీయుల త్యాగ ఫలితమే ఈ స్వాతంత్ర దినోత్సవం పండగల జరుపుకుంటున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన చిన్నారులకు వార్డు ప్రజలకు అంగన్వాడి సిబ్బందికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం చిన్నారులకు స్వీట్లు పంచి పెట్టారు. ఈ వేడుకలలో అంగన్వాడీ టీచర్ రాజేశ్వరి, ఆయా లక్ష్మి, స్థానిక వార్డు ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
Views: 1
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
15 Aug 2026 18:04:59
పంటలను పరిశీలించిన మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్
ఎరువుల తనిఖీ.. నానో యూరియా అందివ్వాలని ఆదేశం
