జిన్నారం పోచమ్మ తల్లి జలాధివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

 అమ్మవారి కరుణాకటాక్షాలతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలి

జిన్నారం పోచమ్మ తల్లి జలాధివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

సంగారెడ్డి / జిన్నారం,: సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపల్ కేంద్రంలో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి. ప్రతిష్ఠ మహోత్సవంలో భాగంగా శుక్రవారం పోచమ్మ తల్లి విగ్రహానికి జలాధివాసం, హోమం, ప్రత్యేక పూజా కార్యక్రమాలను వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి. జలాధివాస కార్యక్రమానికి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హాజరై పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు పొందిన అనంతరం భక్తులతో కలిసి జలాధివాస కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పఠాన్ చెరువుఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ పోచమ్మ తల్లి కరుణాకటాక్షాలతో జిన్నారం ప్రాంత ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలు సుఖశాంతులతో జీవించాలని, ప్రతి కుటుంబంపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు. పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో ఐక్యత, భక్తిభావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయ ప్రాంగణం, పూజా కార్యక్రమాల నిర్వహణ, భక్తుల సౌకర్యాలపై నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు నిర్వాహకులు చేస్తున్న కృషిని అభినందించారు. జలాధివాసం సందర్భంగా పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు, హోమాది కార్యక్రమాలు నిర్వహించడంతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. వేద మంత్రోచ్ఛారణలు, భక్తుల జయజయధ్వానాలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జిన్నారం జి.వెంకటేశం గౌడ్, బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బొల్లారం కోలాన్ బాల్ రెడ్డి, జిన్నారం మున్సిపల్ చైర్మన్ నక్కర్తి జనార్దన్, జిన్నారం మున్సిపల్ వైస్ చైర్మన్ వంగేటి ప్రతాపరెడ్డి, గద్దె సుష్మ గణేష్, కౌన్సిలర్లు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఆలయ నిర్వాహకులు, ఏర్పుల, పోతరాజు, బ్యాగరి, డప్పుల, ఏనుమండుగురు మాదుగుల,చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, వడ్ల, పలువురు వతందారులు,భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు మహిళలు పెద్ద సంఖ్యలు తదితరులు పాల్గొన్నారు.

Views: 44

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

 జగన్ మోహన్ రావు కి రాఖీలు కట్టిన 47వ డివిజన్ ఆడబిడ్డలు  జగన్ మోహన్ రావు కి రాఖీలు కట్టిన 47వ డివిజన్ ఆడబిడ్డలు
మంచిర్యాల టౌన్ రాఖీ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 47వ డివిజన్ కు చెందిన ఆడబిడ్డలు మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు...
సందడిగా మారిన మంచిర్యాల మార్కెట్
రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపిన రఘునాథ్ వెరబెల్లి
బోధన్‌ ఎమ్మెల్యే వ్యాఖ్యలు దురదృష్టకరం 
తెలంగాణ రాష్ట్ర ఓరుగల్లు దళిత చైతన్య సభ వాయిదా
అనుబంధానికి ప్రతిక... రాఖీ వేడుక: ఎమ్మెల్యే కె ఆర్  నాగరాజు 
కాజీపేటలో అదనపు రైలు హాల్టులు,