కొండగట్టు అంజన్న ఆలయ పోస్టుల భర్తీ పూర్తి
జగిత్యాల : జిల్లా మల్యాల మండలం లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో ఖాళీగా ఉన్న అర్చక, డోలు, సన్నాయి పోస్టుల భర్తీ ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. ఆలయ అధికారులు నిర్వహించిన ఈ నియామక ప్రక్రియలో అర్హులైన అభ్యర్థుల తుది జాబితాను ఆలయ కార్యనిర్వాహణాధికారి అధికారికంగా విడుదల చేశారు.ఈ ఏడాది మే 18న నిర్వహించిన అర్హత పరీక్ష ఫలితాలు, ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను తుది ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6 పోస్టులను భర్తీ చేశారు. ఇందులో 4 అర్చక పోస్టులు ఉండగా, డోలు, సన్నాయి విభాగాల్లో ఒక్కొక్క పోస్టు చొప్పున భర్తీ ప్రక్రియను పూర్తి చేశారు అర్చక పోస్టులు (4)తిరునహరి ఆకాష్ మనోజ్. వకుళాభరణం అరుణ్ కుమార్.ఆశ్రిత్ తిరుక్కోవెల. తిరుక్కోవెల అజయ్ ప్రసాద్ డోలు పోస్టు మంగలి సుదర్శన్ బాబు సన్నాయి పోస్టు తిరుమల వెంకట అశోక్ ఎంపికైన అభ్యర్థులు త్వరలోనే ఆలయ నియమ నిబంధనల ప్రకారం విధుల్లో చేరవలసి ఉంటుందని దేవస్థాన అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


