చౌటకూర్‌: ఉపాధి పనుల పరిశీలన

చౌటకూర్‌: ఉపాధి పనుల పరిశీలన

చౌటకూర్‌, చౌటకూర్‌ మండలంలో అమలవుతున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ ఈజీఎస్‌) పనులను రాష్ట్రస్థాయి అధికారుల బృందం గురువారం పరిశీలించింది. మండలంలోని శివంపేట, చౌటకూర్‌ గ్రామాల్లో కూలీలు చేపడుతున్న ఫామ్‌ పాండ్‌ పనులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, పనుల పురోగతి, కూలీల హాజరు, పనుల నిర్వహణ తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. ఫామ్‌ పాండ్‌ల నిర్మాణం ద్వారా వర్షపు నీటిని నిల్వ చేయడంతో పాటు భూగర్భ జలాల పెంపు, వ్యవసాయానికి నీటి లభ్యత మెరుగుపడేలా తీసుకుంటున్న చర్యలను అధికారులు పరిశీలించారు. ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పనులు నిబంధనల ప్రకారం, నాణ్యతా ప్రమాణాలతో కొనసాగుతున్నాయా అనే అంశాలపై కూడా అధికారులు ఆరా తీశారు. ఈ పరిశీలనలో గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌ పీ. శివశంకర్‌, ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ కిరణ్‌ చరణ్‌ పడే, ప్రత్యేక కమిషనర్‌ పీ. శ్రీలక్ష్మి, సాంకేతిక నిపుణుడు అబేద్‌ ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు. సంబంధిత అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనుల వివరాలను రాష్ట్రస్థాయి బృందానికి వివరించారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News