మండల స్థాయి అధికారులతో ఎంపీడీవో సమావేశం

మండల స్థాయి అధికారులతో ఎంపీడీవో సమావేశం

మర్పల్లి (వికారాబాద్ జిల్లా): గ్రామాభివృద్ధి, మండల సమగ్ర అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనలో భాగంగా మంగళవారం మండల కేంద్రంలోని మండల అభివృద్ధి కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో ఎంపీడీవో శాంతమ్మ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీడీవో శాంతమ్మ మాట్లాడుతూ, ప్రతి గ్రామానికి గ్రామ ప్రొఫైల్, మొత్తం మండలానికి మండల ప్రొఫైల్ రూపొందించేందుకు అన్ని శాఖల అధికారులు తమ శాఖలకు సంబంధించిన పూర్తి సమాచారం, గణాంకాలు, మౌలిక వసతులు, సంక్షేమ పథకాల అమలు వివరాలు తదితర అంశాలను ప్రభుత్వం నిర్దేశించిన నమూనాలో సిద్ధం చేసి నిర్ణీత గడువులోగా మండల కార్యాలయానికి సమర్పించాలని కోరారు.అధికారులు సమర్పించే వివరాల ఆధారంగా గ్రామ, మండల ప్రొఫైల్‌లను సమగ్రంగా రూపొందించి భవిష్యత్ అభివృద్ధి కార్యక్రమాల ప్రణాళిక, అవసరాల గుర్తింపు, నిధుల కేటాయింపులో వినియోగించనున్నట్లు తెలిపారు.ఈ ప్రక్రియను అత్యంత ప్రాధాన్యతతో తీసుకుని అన్ని శాఖల అధికారులు సమయపాలన పాటిస్తూ పరస్పర సమన్వయంతో సహకరించాలని ఎంపీడీవో శాంతమ్మ సూచించారు. మండల అభివృద్ధికి ఖచ్చితమైన సమాచారం ఎంతో కీలకమని ఆమె పేర్కొన్నారు. ఈ సమావేశంలో మండల స్థాయి అధికారులు , సిబ్బంది పాల్గొన్నారు.
Views: 72

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

హైదరాబాద్ నుంచి తెలంగాణ ఎగుమతుల కంటైనర్లు ప్రారంభం హైదరాబాద్ నుంచి తెలంగాణ ఎగుమతుల కంటైనర్లు ప్రారంభం
హైదరాబాద్‌: భారత్-యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం(సీఈటీఏ) అమలులోకి వచ్చిన సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో తెలంగాణ నుంచి యునైటెడ్ కింగ్‌డమ్‌ (యూకే)కు వెళ్లే ఎగుమతి కంటైనర్లను అధికారికంగా...
కోట మైసమ్మ ఆలయంలో బహిరంగ వేలం
సింగరేణిలో మెగా వృక్షారోపణ కార్యక్రమం
‘హ్యాండ్లూమ్ హ్యాకథాన్ 2026’ ప్రారంభం
ఇల్లందు–బొమ్మనపల్లి మార్గంలో ట్రాఫిక్ డైవర్షన్ ఎత్తివేత
ఆనెగుంట సర్పంచ్‌కు డీపీఓ షోకాజ్ నోటీసులు
ఏకలవ్య పాఠశాలలో ఆరోగ్య శిబిరం