సేవ కార్యక్రమాలతో సమాజంలో వెలుగులు నింపాలి: ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు
హన్మకొండ: హసన్పర్తి మండల కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వారికి వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు గొడుగులు పంపిణీ చేశారు.రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ సెంట్రల్ ఆధ్వర్యంలో హసన్పర్తిలోని మహాలక్ష్మి బ్యాంకెట్ హాల్లో గొడుగుల పంపిణీ కార్యక్రమానికి వరంగల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామిరెడ్డి ,హన్మకొండ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దిలీప్ రాజ్ గార్లతో కలిసి ఎమ్మెల్యే నాగరాజు ముఖ్య అతిథిగా హాజరై గొడుగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...వర్షాలు కురుస్తుండడంతో రోడ్డు పక్కన, కూడళ్లలో చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వారికి ఉపశమనం పొందేందుకు, రోజంతా ఎండనక, వాననక చిరు వ్యాపారాలు నిర్వహించుకుం టున్న మహిళలు, వృద్ధులకు నీడనివ్వాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టిన క్లబ్ సభ్యులకు ఎమ్మెల్యే అభినందించారు .గతంలో ఈ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులు సైకిళ్ల పంపిణీ, ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ వంటి అనేక సేవా కార్యక్రమాలు చేశారని,మరిన్ని ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కోరే చంద్రమౌళి (గొడుగుల దాత),రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు సోమ వేణుగోపాల్,కార్యదర్శి నాయిని అనిల్ కుమార్,కోశాధికారి జూలూరి కృష్ణమూర్తి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు పింగిలి వేణుగోపాల్ రెడ్డి,డివిజన్ అధ్యక్షులు గొర్రె కిరణ్,ఏనుమాముల మార్కెట్ డైరెక్టర్ రైతు రాజు, వంగపహడ్ పి ఏ సి యస్ చైర్మెన్ మెరుగు రాజేష్ గౌడ్,65 డివిజన్ అధ్యక్షులు సునీల్,సీనియర్ నాయకులు,తోకాల లక్ష్మారెడ్డి,కనపర్తి కిరణ్, వీసం సురేందర్ రెడ్డి,మండల,డివిజన్ ముఖ్య నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Views: 15
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
21 Jul 2026 18:14:10
హైదరాబాద్: భారత్-యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం(సీఈటీఏ) అమలులోకి వచ్చిన సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో తెలంగాణ నుంచి యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే)కు వెళ్లే ఎగుమతి కంటైనర్లను అధికారికంగా...
