విద్యార్థులపై లాఠీలు కాదు, సమాధానాలు చెప్పాలి: ఏఐవైఎఫ్

విద్యార్థులపై లాఠీలు కాదు, సమాధానాలు చెప్పాలి: ఏఐవైఎఫ్

కొత్తగూడెం : న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద "చలో పార్లమెంట్" కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు లాఠీచార్జీ చేయడం,నిర్బంధాలకు పాల్పడడాన్ని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఫహీమ్ దాదా ఖండించారు. విద్యార్థుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన కేంద్ర ప్రభుత్వం పోలీసు బలంతో స్పందించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. ఫహీమ్ దాదా మాట్లాడుతూ, రాజ్యాంగబద్ధమైన హక్కును వినియోగించుకుంటూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థుల ను అడ్డుకునేందుకు ఇనుప బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం, మెట్రో స్టేషన్లను మూసివేయడం,భారీగా పోలీసు బలగాలను మోహరిం చడం, విద్యార్థులను బలవంతంగా అదుపులోకి తీసుకోవడం ప్రజాస్వామ్య దేశానికి తగదని అన్నారు.ఎన్‌టీఏలో చోటుచేసుకున్నఅవినీతి, పరీక్షల నిర్వహణలోపారదర్శకత లోపం, వరుస పరీక్షా కుంభకోణాల కారణంగా దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో ఆందోళన నెలకొందని పేర్కొన్నారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లపై స్పందించకుండా వారిపై బలప్రయోగానికి దిగడం కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. దేశ భవిష్యత్తును నిర్మించే విద్యార్థులను నేరస్థుల్లా చూడడం మానుకోవాలని, ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన మౌలిక హక్కు అని తెలిపారు. పారదర్శకమైన పరీక్షా వ్యవస్థ, ఎన్‌టీఏలో సమగ్ర సంస్కరణలు అమలు చేసి విద్యార్థులకు న్యాయం జరిగే వరకు ఏఐవైఎఫ్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. విద్యార్థులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని, నిర్బంధించిన వారిని విడుదల చేయాలని, లాఠీచార్జీకి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థి సంఘాలతో చర్చలు జరిపి వారి డిమాండ్లను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి జర్పుల ఉపేందర్‌తో పాటు కొయ్యడ రవి, వెంకట్, నరేష్, రమేష్, బాబు, ప్రియాంక, కళ్యాణి, సురేష్, పవన్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.
Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

హైదరాబాద్ నుంచి తెలంగాణ ఎగుమతుల కంటైనర్లు ప్రారంభం హైదరాబాద్ నుంచి తెలంగాణ ఎగుమతుల కంటైనర్లు ప్రారంభం
హైదరాబాద్‌: భారత్-యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం(సీఈటీఏ) అమలులోకి వచ్చిన సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో తెలంగాణ నుంచి యునైటెడ్ కింగ్‌డమ్‌ (యూకే)కు వెళ్లే ఎగుమతి కంటైనర్లను అధికారికంగా...
కోట మైసమ్మ ఆలయంలో బహిరంగ వేలం
సింగరేణిలో మెగా వృక్షారోపణ కార్యక్రమం
‘హ్యాండ్లూమ్ హ్యాకథాన్ 2026’ ప్రారంభం
ఇల్లందు–బొమ్మనపల్లి మార్గంలో ట్రాఫిక్ డైవర్షన్ ఎత్తివేత
ఆనెగుంట సర్పంచ్‌కు డీపీఓ షోకాజ్ నోటీసులు
ఏకలవ్య పాఠశాలలో ఆరోగ్య శిబిరం