పోచమ్మకు మొక్కులు చెల్లించిన బేడ బుడగ జంగాలు

పోచమ్మకు మొక్కులు చెల్లించిన బేడ బుడగ జంగాలు

ముత్తారం, పెద్దపల్లి : ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన బేడ బుడగ జంగాలు కుటుంబ సభ్యులు గ్రామ దేవత పోచమ్మకు మొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి పచ్చని ప్రకృతి ఒడిలో వనభోజనాలు ఏర్పాటు చేసుకుని ఆధ్యాత్మిక వాతావరణంలో ఆనందంగా గడిపారు.ఈ సందర్భంగా పెద్దలు గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, పాడిపంటలతో వర్ధిల్లాలని పోచమ్మ తల్లిని ప్రార్థించారు. సంప్రదాయాలను పరిరక్షిస్తూ ప్రతి ఏడాది ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుందని తెలిపారు.చిన్నారులు,మహిళలు, యువకులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ కార్యక్రమంలో పెద్ద మనుషులు పర్తం జంపయ్య,తూర్పటి శంకర్, షేర్ల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Views: 125

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి పెరుగు బసంతోత్సవం అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి పెరుగు బసంతోత్సవం
మర్పల్లి,: వికారాబాద్ జిల్లా కేంద్రంలో నీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో బుధవారం నిర్వహించిన పెరుగు బసంతోత్సవంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం...
14 మందికి క్వార్టర్ల కేటాయింపు 
ఘనంగా భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు
‘క్యాతన్ పల్లిలో’ కమిషనర్ విధులకు ఆటంకం 
విద్యార్థుల అభ్యాస లోపాలపై ప్రత్యేక దృష్టి సారించాలి
భక్తులతో కిటకిటలాడిన సాయిఆలయాలు
వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత