ఎస్.ఐ.ఆర్ శిబిరాల పరిశీలన
పటాన్ చెరు (సంగారెడ్డి):పటాన్‌చెరు నియోజకవర్గంలో ఎస్‌ఐఆర్ శిబిరాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలోని సుల్తాన్‌పూర్, ఐలాపూర్, పటాన్‌చెరు ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్ శిబిరాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా శిబిరాల నిర్వహణ తీరును పరిశీలించి, బీఎల్వోలు మరియు అధికారులతో మాట్లాడారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియకు ప్రభుత్వం గడువు పొడిగించిన నేపథ్యంలో మిగిలిన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.బీఎల్వోలు, బీఎల్ఓలు మరియు సంబంధిత సిబ్బంది సమన్వయంతో ఈ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, సంగారెడ్డి జిల్లా కలెక్టర్, అదనపు జిల్లా కలెక్టర్ సంగారెడ్డి, ఎన్నికల రిటర్నింగ్ అధికారి పటాన్‌చెరు, ఏఈఆర్ఓ (డిప్యూటీ కమిషనర్) అమీన్‌పూర్, తహసీల్దార్ అమీన్‌పూర్, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ శ్రీ ప్రదీప్ కుమార్, ఏఎంసీ అమీన్‌పూర్, బీఎల్‌ఏలు సూపర్వైజర్ లు, పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


