స్వలాభం కోసమే హుస్నాబాదును కరీంనగర్లో కలిపేందుకు మంత్రి పొన్నం కుట్రలు

WhatsApp Image 2026-01-23 at 1.53.20 PM

 

హుస్నాబాద్  : తన రాజకీయ లబ్ధి కోసమే హుస్నాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ ను కరీంనగర్లో విలీనం చేసేందుకు కుట్రలు చేస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ ఆరోపించారు. గురువారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని హనుమకొండ రోడ్డు నుంచి సిద్దిపేట రోడ్డు వరకు స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేశారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా సతీష్ కుమార్ మాట్లాడుతూ గతంలో హుస్నాబాద్, కోహెడ, అకన్నపేట మండలాలను అశాస్త్రీయంగా, ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా సిద్దిపేట జిల్లాలో కలిపారని మంత్రి పొన్నం మాట్లాడడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనం అన్నారు. జిల్లాల ఏర్పాటు సమయంలో ఈ మూడు మండలాల్లో గ్రామాల వారీగా గ్రామసభలు నిర్వహించి ప్రజాభిప్రాయం మేరకే శాస్త్రీయంగానే సిద్దిపేటలో కలిపామనేది ఆయన తెలుసుకోవాలన్నారు. ఏ జిల్లాకు మారినప్పటికీ మాకు ఆర్డిఓ, ఏసీపీ కార్యాలయాలు ఉంటే చాలు అని స్వయంగా కాంగ్రెస్ నాయకులు ధర్నాలు చేశారనేది గుర్తుపెట్టుకోవాలన్నారు. కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ధర్నా టెంట్ వద్దకు వెళ్లి తానే స్వయంగా హామీ ఇచ్చానని, ఇది ఇక్కడి కాంగ్రెస్ నాయకులకు తెలియదా అని ప్రశ్నించారు. కరీంనగర్ లో కలపాలని ప్రజలు ఎవరు కోరుకోవడం లేదని, మంత్రి తన ప్రయోజనం కోసం మాత్రమే కొత్త వివాదానికి తెరలేపుతూ ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నాడని అన్నారు. మరోసారి కరీంనగర్ లో విలీనం అనే మాట ఎత్తితే ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. అలాగే గడిచిన రెండేళ్లుగా ఎంతో అభివృద్ధి చేస్తానని చెప్పుకుంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటివరకు ఇక్కడ పూర్తిచేసిన పని ఏ ఒక్కటి కూడా లేదన్నారు. ప్రజలను మభ్య పెట్టేందుకు రింగురోడ్డు అని అది అని ఇది అని మాటలు చెప్పడం తప్ప చేతల్లో కనిపించడం లేదని విమర్శించారు. ఐఓసీ భవనం ఊరికి దూరంగా కట్టారని ఒక కేబినెట్ మంత్రిగా ఉండి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆయనే మంజూరి చేశానని చెప్పుకుంటున్న 250 పడకల దవాఖాన భవనం కోసం వేరేచోట భూమి లేక పక్కాగా ఉన్న పాత భవనాన్ని కూల్చివేశారు అనేది గుర్తుంచుకోవాలన్నారు.  కాగా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం హామీ తప్ప ఏ ఒక్కటి నెరవేర్చడం లేదన్నారు. ప్రజలకు హామీ ఇచ్చి ఎగ్గొట్టిన బాకీల గురించి ప్రజలకు వివరిస్తున్నామని తెలిపారు. ప్రజలకు బాకీ పడ్డ సొమ్మును కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించాల్సిందేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేయడంతో పాటు వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయాలని కోరుతూ ఇంటింటి ప్రచారం ప్రారంభించినట్లు సతీష్ కుమార్ వివరించారు. హుస్నాబాద్ పట్టణ ప్రజల మద్దతుతో, కార్యకర్తల కృషితో మూడోసారి కచ్చితంగా హుస్నాబాద్ మున్సిపల్ లో గులాబీ జెండాను ఎగరవేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Views: 213

About The Author

Vision Andhra Telugu Daily Picture

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

రామగుండం పోలీస్ కమిషనరేట్  “ఒక ఫోన్ కాల్… ఒక మెసేజ్… చాలు”  భయం వీడండి… ఫిర్యాదు చేయండి… రామగుండం పోలీస్ కమిషనరేట్ “ఒక ఫోన్ కాల్… ఒక మెసేజ్… చాలు” భయం వీడండి… ఫిర్యాదు చేయండి…
    రామగుండం : రామగుండం పోలీసు కమిషనరేట్.. మహిళల భద్రతే పోలీసుల లక్ష్యమని ఒక ఫోన్ కాల్ చేయండి… ఒక మెసేజ్ పంపండి. భయం వీడండి… ధైర్యంగా
ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వినియోగించుకోవాలి – కల్వకుర్తి పురపాలక సంఘం కమిషనర్ మహమూద్ షేక్
కమలం గుర్తుతో అభివృద్ధికి హామీ
కార్యకర్తల సమీక్ష సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు
హుస్నాబాద్ లోప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యం
అభివృద్ధే లక్ష్యంగా ప్రచారంలో దూసూకుపోతున్న కాంగ్రెస్ అభ్యర్థి జీ రాధా
2026 హైదరాబాద్ జిల్లా డైరీ బహుకరణ