ఆరుతడి పంటలను సాగు చేయాలి: వ్యవసాయ అధికారి రాము
సిద్ధిపేట : మర్కుక్ మండలం : సిద్ధిపేట జిల్లా మర్కుక్ మండల పరిధిలోని నర్సన్నపేట గ్రామంలో రైతుల అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా మండల వ్యవసాయ అధికారి బోయినపల్లి రాము మాట్లాడుతూ ఈ వానాకాలంలో ఎల్‌నినో ప్రభావం కారణంగా సాధారణం కంటే వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని రైతులకు తెలిపారు.ఈ పరిస్థితుల్లో అధిక నీటి అవసరమున్న వరి పంట సాగును తగ్గించి,తక్కువ నీటితో సాగు చేయగల ఆరుతడి పంటలైన పత్తి,కంది, పెసర, మినుము, జొన్న, సజ్జ,మొక్కజొన్న వంటి పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు.అలాగే అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగిస్తూ,నేల తేమను కాపాడే యాజమాన్య పద్ధతులను పాటించాలన్నారు.వ్యవసాయ శాఖ సూచించిన పంటలనే సాగు చేసి నష్టాలను తగ్గించుకోవాలని రైతులకు వివరించారు.రైతులు వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ,వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించాలని,అవసరమైన సాంకేతిక సలహాల కోసం తమ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గిల్క బాల నర్సయ్య,టెక్నికల్ అసిస్టెంట్ రాజు,పంచాయతీ కార్యదర్శి సతీష్ కుమార్,వార్డు సభ్యులు,గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.
Views: 21
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
21 Jul 2026 18:14:10
హైదరాబాద్: భారత్-యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం(సీఈటీఏ) అమలులోకి వచ్చిన సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో తెలంగాణ నుంచి యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే)కు వెళ్లే ఎగుమతి కంటైనర్లను అధికారికంగా...
