విద్యార్థులపై లాఠీచార్జి అమానుషం

విద్యార్థులపై లాఠీచార్జి అమానుషం

కారేపల్లి (ఖమ్మం): డిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు దాడి చేయడం అమానుషమని మండల కాంగ్రెస్ నాయకులు తోటకూరీ రాంబాబు అన్నారు.దీనికి నిరసనగా బుధవారం కారేపల్లి క్రాస్ రోడ్డులో మండల కాంగ్రెస్ నాయకత్వం ఆధ్వర్యంలో రోడ్లపై బైఠాయించి నిరసనలు తెలిపి నినాదాలు చేశారు.విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి,మోడీ డౌన్ డౌన్అంటూ నినాదాలు చేశారు.అనంతరం కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్మూర్తి నాయక్ మాట్లాడుతూ...విద్యా వ్యవస్థను కార్పొరేట్ శక్తులకు అప్పగించే కుట్ర జరుగుతోందని, అందులో భాగంగానే విద్యార్థులపై లాఠీ రులిపించడం అమానుషమని అన్నారు.పరీక్షల నిర్వహణలో పారదర్శకత లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని,ఈ పరిస్థితుల్లో పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు అత్యంత విషాదకరమని పేర్కొన్నారు.పార్లమెంట్ కు సమీపంలోనే ఆందోళనకారులను అడ్డుకుని బలప్రయోగానికి దిగడాన్ని తీవ్రంగా ఖండించారు. జరిగిన ఘటనలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై నమోదైన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని,లాఠీచార్జీకి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు,అన్ని గ్రామాల సర్పంచులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
 
Views: 108

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పాఠశాలలో ప్రమాదకర చెట్ల కొమ్మల తొలగింపు పాఠశాలలో ప్రమాదకర చెట్ల కొమ్మల తొలగింపు
చౌటకూర్ : చౌటకూర్ మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ చౌటకూర్ పాఠశాల ఆవరణలో విద్యుత్ తీగలను తాకుతూ ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలను సంబంధిత అధికారులు తొలగించారు.ఇటీవల విద్యుత్...
పలు ప్రజా సమస్యలపై వినతిపత్రం
ఎమ్మెల్యే పై సీఎం వ్యాఖ్యలను వక్రీకరిస్తే ఖబర్దార్..!
ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక. 
అక్టోబర్ చివరి వరకే సింగూరు తాగునీరు
ఆల్ ఇండియా మార్వాడీ యువ మంచ్ శాఖ సేవా కార్యక్రమం.
చౌటకూర్ రైతు వేదికలో మండల స్థాయి సమీక్ష సమావేశం