కోరమీసాల వీరభద్రస్వామి ఆలయ అభివృద్ధి కి కృషి చేస్తా

కొత్తకొండ వీరభద్రస్వామిని దర్శించుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్


WhatsApp Image 2026-01-13 at 2.17.02 PM

 

హుస్నాబాద్  : హుస్నాబాద్ నియోజకవర్గంలోని కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయ అభివ్రుద్ధికి అన్ని విధాలా కృషి  చేస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు.మంగళవారం రోజున హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండకు విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కు స్థానిక బీజేపీ నేతలు కోలాటాలు, డప్పులతో ఘన స్వాగతం పలికారు. వారితో కలిసి శ్రీ వీరభద్రస్వామిని దర్శించుకునేందుకు ఆలయం వద్దకు రాగానే టెంపుల్ నిర్వాహకులు, పూజారులు ఘన స్వాగతం పలికారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసిన బండి సంజయ్ అనంతరం వీరభద్రస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ప్రకృతి తో ముడిపడిన ఈ పండుగను తెలుగు ప్రజలందరూ సంతోషంగా, సంబురంగా జరుపుకుంటామని,విదేశీ సంస్కృతి కి  అలవాటుపడి మన సంస్కృతి  మర్చిపోతున్న ఈ తరుణంలో ముగ్గుల పోటీలు, సంక్రాంతి పోటీలు నిర్వహిస్తూ తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను గుర్తు చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు.
కొత్తకొండ వీరభద్రస్వామి స్వామి బ్రహ్మోత్సవాలకు ప్రతి ఏటా రావడం ఆనవాయితని, అందులో భాగంగా ఇక్కడికి వచ్చి స్వామి వారిని దర్శించుకున్ననన్నారు.కోరిన కోర్కెలు తీర్చే కోరమీసాల స్వామి వీరభద్రుడని,చాలా సందర్భాల్లో ఇవి నిరూపితమైందన్నారు. కోర మీసాల స్వామి కాబట్టి సమాజాన్ని నాశనం చేయాలనుకునేవాళ్లకు, చెడు ఆలోచనలు ఉన్న వాళ్లలో మార్పు తీసుకొచ్చే స్వామి వీరభద్రుడు. ఈ జిల్లా, రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. అందరం కలిసి నరేంద్రమోదీ సంకల్పంతో భారత్ ను విశ్వగురుగా తీర్చిదిద్దేందుకు వికసిత్ భారత్ పేరిట శక్తివంచన లేకుండా కష్టపడుతున్నారు. ఈ తరుణంలో ప్రతి ఒక్కరూ మోదీకి అండగా నిలవాలన్నారు.ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలకు వస్తుంటారు. ఆలయ అభివృద్ధి కి సహకరిస్తూనే ఉన్నానని, భవిష్యత్తులో దేవాలయ అభివృద్ధి కి నా వంతు కృషి చేస్తానన్నారు.

Views: 51

About The Author

Vision Andhra Telugu Daily Picture

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Tags:

Related Posts

Error on ReusableComponentWidget

Latest News

అధికారుల సహకారంతోనే జిల్లా సమగ్రాభివృద్ధికి శక్తియులా కృషి చేశా...  అధికారుల సహకారంతోనే జిల్లా సమగ్రాభివృద్ధికి శక్తియులా కృషి చేశా...
    అక్కున చేర్చుకున్న కరీంనగర్ ను కన్న ఊరులా ఎప్పటికీ మర్చిపోలేను... కరీంనగర్ : జిల్లా కలెక్టర్గా అభివృద్ధి చేసే గొప్ప అవకాశాన్ని కరీంనగర్ ఇచ్చిందని,  కన్న
ఏఐ సాంకేతికత వెనుక దాక్కోవడం సిగ్గుచేటు -- మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య
తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గా ఎండి రహీం
శంకరపట్నం మండల ఆర్ఎంపీల అసోసియేషన్ అధ్యక్షునిగా సాంబయ్య...
పట్టా భూమి కబ్జాకు యత్నం - అధికారులు ఆదుకోని న్యాయం చేయాలి
ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి ----- మున్సిపల్ ఛైర్ పర్సన్ బండారి అనూష సతీశ్ .
రైతులు పండించిన పంట రైతుకే దక్కాలి వైరా ఎమ్మెల్యే