ఆపదలో అండగా నిలిచిన యువత
కీర్తన కుటుంబానికి పది వేల ఆర్థిక సహాయం
దౌల్తాబాద్,సిద్దిపేట: మండలంలోని అప్పాయిపల్లి గ్రామానికి చెందిన డాకి కీర్తన అనారోగ్యంతో మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. కీర్తన మృతితో ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలుసుకున్న గ్రామ యువకులు మానవత్వంతో స్పందించారు. కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో తమ వంతు సహాయంగా పది వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ కష్టకాలంలో బాధిత కుటుంబానికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. కీర్తన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ నర్సింలు, మాజీ ఉప సర్పంచ్ కేశబోయిన ప్రభాకర్, వార్డు సభ్యుడు భాను, స్వామి,రమేష్,సాయిలు,మల్లేష్,అనిల్,సాయి తదితరులున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


