సైడ్ జరుగు... 

సైడ్ జరుగు... 

  • పోలీసుల విధులు.. ఎవరి కోసం..?
  • వినాయక చవితి వేళ బందోబస్తు విధులా..? రాజకీయ నేతల సేవలా..?
  • రాజకీయ కార్యక్రమాల్లో పోలీసుల హాజరు పై ప్రశ్నలు.. 
  • ప్రజా భద్రత కంటే రాజకీయ కార్యక్రమాలకే ప్రాధాన్యమా..?
  • విధుల్లో ఉన్న అధికారులు నేతల వెంట కనిపించడంపై చర్చ..

సూర్యాపేట బ్యూరో   వినాయక చవితి పర్వదినం సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో భారీగా గణేష్‌ విగ్రహాల ఏర్పాటు, ఊరేగింపులు, భక్తుల రద్దీ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ట్రాఫిక్‌ నియంత్రణ, గణేష్‌ మండపాల వద్ద భద్రత, ఊరేగింపుల నిర్వహణ వంటి అంశాల్లో పోలీసుల బందోబస్తు కీలకంగా మారుతుంది.అయితే సూర్యాపేట పట్టణంలో కొందరు పోలీసు అధికారులు ఒక సీఐ, ఇద్దరు ఎస్ఐలు, సిబ్బంది ప్రజా భద్రతకు సంబంధించిన బందోబస్తు విధులను పక్కనపెట్టి రాజకీయ నాయకుల కార్యక్రమాల వెంట కనిపిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు కనిపించడం పట్ల ప్రజల్లో పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

విధుల కేటాయింపులో స్పష్టత ఉందా..?

వినాయక చవితి వంటి ప్రజా సమూహాలు అధికంగా ఉండే సందర్భాల్లో పోలీసు బందోబస్తుకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉండగా.. సిబ్బందిని ఇతర కార్యక్రమాలకు ఎలా కేటాయిస్తున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. రాజకీయ నాయకుల పర్యటనలు, కార్యక్రమాలకు పోలీసుల హాజరు అవసరమైతే అది అధికారిక ఆదేశాల మేరకే జరుగుతుందా..? అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.

ప్రజల భద్రత ఎవరి బాధ్యత..?

గణేష్‌ మండపాలు, ఊరేగింపు మార్గాలు, ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్‌ నియంత్రణ, రాత్రి వేళల్లో భద్రత వంటి అంశాల్లో పోలీసుల సమర్థవంతమైన విధులు అవసరం. ఈ సమయంలో సిబ్బంది కొరత ఏర్పడితే దాని ప్రభావం నేరుగా ప్రజల భద్రతపై పడే అవకాశం ఉంది.అధికారిక బందోబస్తు విధులు, రాజకీయ కార్యక్రమాల్లో పోలీసుల హాజరు మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉండాలని ప్రజలు కోరుతున్నారు. విధుల్లో ఉన్న సిబ్బంది ఏ కార్యక్రమానికి, ఏ ఆదేశాల మేరకు కేటాయించబడ్డారన్న అంశంపై ఉన్నతాధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసు అధికారులు ప్రోటోకాల్ లేని కొంతమంది రాజకీయ నాయకుల వెంట ఉండటం మాత్రమే విధుల దుర్వినియోగానికి ఆధారంగా భావించలేము.అయితే అధికారిక బందోబస్తు అవసరాలను పక్కనపెట్టి రాజకీయ కార్యక్రమాలకు సిబ్బందిని వినియోగించినట్లు నిర్ధారణ అయితే మాత్రం అది పరిశీలించాల్సిన అంశంగా మారుతుంది. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు సమీక్షించి, అవసరమైన చోట బాధ్యతలు స్పష్టంగా కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు.

WhatsApp Image 2026-09-16 at 9.45.30 AM

Views: 317

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం
హైదరాబాద్ : బీసీ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించి, వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పడే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న *“ఇంటింటా ఇందిరమ్మ కుట్టు...
సెప్టెంబర్ 17 న హైదరాబాద్ లో టి. ఆర్.పి పాదయాత్ర
బాలాపూర్ లో స్పీకర్ గడ్డ ప్రసాద్ కు ఘన స్వాగతం
ప్రధాని మోదీ పుట్టినరోజున ప్రతి ఇంట దీపం వెలిగించాలి
సీఎం రేవంత్ రెడ్డి తో సింగపూర్ వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇంధనవాణిజ్య విభాగం శాశ్వత కార్యదర్శి అగస్టిన్ లీ భేటీ.. 
సెప్టెంబర్‌ 17పై సమరశంఖం!
చాంద టి నిమజ్జన ప్రదేశాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్