మండల స్థాయి క్రీడల్లో రత్నాపూర్ హైస్కూల్ విద్యార్థుల సత్తా

మండల స్థాయి క్రీడల్లో రత్నాపూర్ హైస్కూల్ విద్యార్థుల సత్తా

శివంపేట్, (మెదక్): మెదక్ జిల్లా శివంపేట్ మండల స్థాయి ఆటల పోటీల్లో రత్నాపూర్ హైస్కూల్ విద్యార్థినీ, విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి పలు విభాగాల్లో ప్రథమ బహుమతులు సాధించారు. బాలుర కబడ్డీ, వాలీబాల్‌తో పాటు జూనియర్స్ కబడ్డీలోనూ రత్నాపూర్ హైస్కూల్ విద్యార్థులు ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అలాగే బాలికల కబడ్డీ, వాలీబాల్ విభాగాల్లోనూ ప్రథమ బహుమతులు సాధించి పాఠశాలకు ఘనత తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఘన విజయం సాధించిన విద్యార్థినీ, విద్యార్థులను, అలాగే క్రీడలకు శిక్షణ అందించిన పీఈటీ మేడంను రత్నాపూర్ సర్పంచ్ కండేగారి ఆంజనేయులు, ఉప సర్పంచ్ అల్లం నరసింహులు, వార్డు మెంబర్ నవీన్ కుమార్ అభినందించారు. అనంతరం విద్యార్థులను, పీఈటీ మేడంను శాలువాలతో సన్మానించి వారి ప్రతిభను కొనియాడారు. పాఠశాల విద్యార్థులు మండల స్థాయిలో పలు క్రీడా విభాగాల్లో ప్రథమ బహుమతులు సాధించడం పట్ల గ్రామస్థులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

Views: 5

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడంలో మీడియా కీలక పాత్ర కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడంలో మీడియా కీలక పాత్ర కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
కామారెడ్డి బ్యూరో : ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమైన కార్యక్రమాలు, ముఖ్యంగా సామాజిక సంక్షేమం, ప్రజా భద్రతకు సంబంధించిన అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో మీడియా కీలక...
లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు ల పంపిణీ 
హుస్నాబాద్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో  ఓజోన్ దినోత్సవం
రాచర్ల గొల్లపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో ఏకరూప దుస్తుల పంపిణీ
మోదీ 25 ఏళ్ల పాలనా ప్రస్థానం స్ఫూర్తిదాయకం
ఫ్లెక్సీ చింపిన వ్యక్తులపై కేసు నమోదు
పిల్లలకు ప్రభుత్వం ఇవ్వగలిగే గొప్ప ఆస్తి విద్యే