రాచర్ల గొల్లపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో ఏకరూప దుస్తుల పంపిణీ

విద్యార్థులు చదువులో రాణించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలి: సర్పంచ్ కొండ రమేష్ గౌడ్

రాచర్ల గొల్లపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో ఏకరూప దుస్తుల పంపిణీ

ఎల్లారెడ్డిపేట,: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో తెలంగాణ ప్రభుత్వం 2026–27 విద్యా సంవత్సరానికి అందించిన ఏకరూప దుస్తులను బుధవారం విద్యార్థులకు పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ కొండ రమేష్ గౌడ్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ జనగామ రమ, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, పాఠశాల మాజీ కమిటీ చైర్మన్ గోగూరి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా విద్యార్థులకు యూనిఫాంలను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోందన్నారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఏకరూప దుస్తులను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత ఫలితాలు సాధించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఇన్చార్జి ప్రధా నోపాధ్యాయులు సి.హెచ్. రత్నాకర్ మాట్లాడుతూ ఏకరూప దుస్తులు విద్యార్థుల్లో సమానత్వం, ఐక్యత భావాలను పెంపొందిస్తాయని అన్నారు. ప్రభుత్వం అందించిన యూనిఫాంలను ప్రతిరోజూ ధరించి క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరుకావాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమానికి సహకరించిన సర్పంచ్, గ్రామపంచాయతీ పాలకవర్గానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News