లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు ల పంపిణీ
12 మంది లబ్ధిదారులకు 4,92,000 రూపాయల చెక్కులు పంపిణీ
వెంకటాపురం : అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందిన పలువురు పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని (చెక్కులు ) ములుగు జిల్లా, వెంకటాపురం మండల కేంద్రము లోని విశ్రాంతి భవనం ఆవరణలో భద్రాచలం నియోజకవర్గం శాసనసభ్యుడు డాక్టర్ తెల్లం వెంకట్రావు చేతుల మీదుగా 12 మంది లబ్ధిదారులకు 4,92,000 రూపాయల చెక్కులు పంపిణీ బుధవారం చేశారు.ఆనంతరం ఆయన మాట్లాడుతూ వేలాది మంది పేద,మధ్య తరగతి ప్రజలకు యేటా సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూతనందించడం జరుగుతుంది అని తెలిపారు.నియోజకవర్గంలో వందలాది మంది పేదలకు వైద్య సేవల కోసం సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులు అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ తాటి సరస్వతి,పీఏసీఎస్ చైర్మన్ చిడెం మోహన్ రావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సయ్యద్ హుస్సేన్, కాంగ్రెస్ ములుగు జిల్లా ఉపాధ్యక్షుడు ధనపనేని వెంకటేశ్వర్లు, యువజన విభాగం అధ్యక్షుడు చిట్టెం సాయి, సీనియర్ నాయకులు చిట్టెం వాసు,కాల్వ సుందర్ రావు, శ్రీనివాసరెడ్డి, చిట్యాల సాగర్, రామక్రిష్ణ, డర్రరవి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


