విశ్వకర్మ జయంతి ను ఘనంగా నిర్వహించాల
మాగనూరు : మాగనూరు మండల కేంద్రం లో కాళికా దేవి ఆలయం లో ఉమ్మడి మండలం ఆధ్వర్యంలో 4 సంవత్సరము విశ్వ కర్మ జయంతి ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి మండల గౌరవ అధ్యక్షులు కృష్ణయ్య ఆచారి, అధ్యక్షులు మోనేష్ ఆచారి, ప్రధాన కార్యదర్శి కాళప్ప ఆచారి, కోశాధికారి కమ్మరి దేవేంద్రప్ప, కార్యదర్శి వడ్ల విజయ్ కుమార్ తెలిపారు,ఈ సందర్బంగా గురువారం ఉదయం 8 నుండి 10 గంటల వరకు స్వామి వారిని ఊరేగింపు కార్యక్రమం ఉన్నట్లు అనంతరం పూజలు, తీర్థ ప్రసాదాలు, అన్న ప్రసాదం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు,మాగనూరు కు చెందిన అవుసలి వెంకటేష్ చారి దంపతులు అన్న ప్రసాదం కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు నిర్వాహ కులు తెలిపారు, ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు విశ్వ బ్రాహ్మణులు అధిక సంఖ్య లో పాల్గొని విజయవంతం చెయ్యాలని కోరారు,
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

