మోదీ 25 ఏళ్ల పాలనా ప్రస్థానం స్ఫూర్తిదాయకం

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్

మోదీ 25 ఏళ్ల పాలనా ప్రస్థానం స్ఫూర్తిదాయకం

  • ఘనంగా ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు
  • మల్యాల మండల కార్యకర్తల కోసం రూపొందించిన ప్రత్యేక కీ చైన్స్ ఆవిష్కరణ

మల్యాల, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  జన్మదినాన్ని పురస్కరించుకుని, మల్యాల మండల బీజేపీ శ్రేణుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కీ చైన్స్ను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బుధవారం ఘనంగా ఆవిష్కరించారు. ​ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా 13 సంవత్సరాలు, దేశ ప్రధానమంత్రిగా 12 సంవత్సరాలు... వెరసి మొత్తం 25 సంవత్సరాల ప్రజాపాలనను ఎలాంటి మచ్చలేకుండా విజయవంతంగా పూర్తి చేసుకున్నారని కొనియాడారు. ఈ చారిత్రక మైలురాయిని పురస్కరించుకుని, కార్యకర్తలకు ఎల్లప్పుడూ మోదీ సుపరిపాలన స్ఫూర్తిగా నిలవాలనే ఉద్దేశంతో మల్యాల మండల కార్యకర్తల కోసం ఈ ప్రత్యేక కీ చైన్లను తయారు చేయించినట్లు వెల్లడించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చేతుల మీదుగా వీటిని ఆవిష్కరింపజేయడం పట్ల స్థానిక నాయకులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సంఘం నరేష్, మండల అధ్యక్షులు గాజుల మల్లేశం, నాయకులు బొబ్బిలి వెంకటస్వామి యాదవ్, మద్దుట్ల సర్పంచ్ సంకుర్తి తిరుపతి, సంఘని రవి, బీజేవైఎం మండల అధ్యక్షులు పొన్నగంటి గౌతమ్, నులుగొండ సురేష్‌లతో పాటు పలువురు మండల, గ్రామ స్థాయి నాయకులు, బిజెపి కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు ల పంపిణీ  లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు ల పంపిణీ 
వెంకటాపురం : అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆస్పత్రుల్లో  చికిత్స పొందిన పలువురు పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని (చెక్కులు ) ములుగు...
హుస్నాబాద్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో  ఓజోన్ దినోత్సవం
రాచర్ల గొల్లపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో ఏకరూప దుస్తుల పంపిణీ
మోదీ 25 ఏళ్ల పాలనా ప్రస్థానం స్ఫూర్తిదాయకం
ఫ్లెక్సీ చింపిన వ్యక్తులపై కేసు నమోదు
పిల్లలకు ప్రభుత్వం ఇవ్వగలిగే గొప్ప ఆస్తి విద్యే
మండల స్థాయి క్రీడల్లో రత్నాపూర్ హైస్కూల్ విద్యార్థుల సత్తా