గణేష్ ఉత్సవాల నేపథ్యంలో గణేష్ మండపాల వద్ద భద్రతా ఏర్పాట్లను
క్షుణ్ణంగా పరిశీలించిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్
నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలో గణేష్ ఉత్సవాలు ప్రశాంతమైన వాతావరణంలో , ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు పోలీస్ శాఖ పటిష్టమైన భద్రతా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.యస్.నగరంలోని పలు గణేష్ మండపాలను సందర్శించి బందోబస్తు ఏర్పాట్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గణేష్ మండపాల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది వివరాలు , బందోబస్తు పాయింట్లు , సిబ్బంది అప్రమత్తత తదితర అంశాలను పరిశీలించారు. అలాగే ప్రతి మండపం వద్ద నిర్వహిస్తున్న పాయింట్ బుక్‌లను క్షుణ్ణంగా తనిఖీ చేసి , సిబ్బంది విధుల్లో భాగంగా నమోదు చేస్తున్న వివరాలను పరిశీలించారు. మండపాల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని , ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండాచర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. రాత్రి వేళల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి , అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గణేష్ ఉత్సవాలు మరియు నిమజ్జన కార్యక్రమాలు శాంతియుతంగా , సురక్షితంగా జరిగేలా పోలీస్ అధికారులు , సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించాలని కమిషనర్ సూచించారు. ప్రజలు,గణేష్ మండపాల నిర్వాహకులు పోలీస్ శాఖకు సహకరించి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఆయన కోరారు. టౌన్ ఏసిపి శ్రీ ప్రకాష్ , టౌన్ 1 ఎస్హెచ్ఓ శ్రీ బి. రఘుపతి , ఎన్. ఐ. బి సీఐ శ్రీ అశోక్ మరియు సిబ్బంది గలరు.

About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


