హుస్నాబాద్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో  ఓజోన్ దినోత్సవం

హుస్నాబాద్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో  ఓజోన్ దినోత్సవం

హుస్నాబాద్ : సెప్టెంబర్ 16 ఓజోను దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నామని, అందులో భాగంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ, హెచ్ఓడి కుమారస్వామి ఆధ్వర్యంలో ఓజోన్ దినోత్సవాన్ని విద్యార్థిని విద్యార్థుల సమక్షంలో జరుపుకున్నారు. ఈ సందర్బంగా కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ డాక్టర్ అనిల్ కుమార్ మాట్లాడు తూ పర్యావరణ సంరక్షణ, చెట్ల పెంపకం, కాలుష్య నివారణ, సహజ వనరుల సద్వినియోగం, క్లోరో ఫ్లోరో కార్బన్స్ ను తగ్గించడం నిత్యజీవితంలో వాడే ఏసీలు రెఫ్రిజిరే టర్స్ వినియోగాన్ని బాగా తగ్గించి వాటి నుండి వెలువడే క్లోరోఫ్లోరో కార్బన్స్,  ఏరోప్లేన్స్ నుంచి వెలువడే ఏరోజాల్స్ వలన ఓజోన్ పొర దెబ్బతింటుందని, అది మనకు సహజంగా ఉండే రక్షణ కవచంగా ఆల్ట్రా వైలెట్ కిరణాలను అడ్డు కుంటుందని, తద్వారా మానవాళి, జీవజాతులు వృక్ష సంపద, ఆరోగ్యంగా, సమతుల్యంగా ఉంటాయని పేర్కొన్నారు. కావున విద్యార్థిని విద్యార్థులు అందరూ ఓజోన్ పొర సంరక్షణకు, పర్యావరణ కాలుష్యము తగ్గించడానికి కట్టుబడి ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అకాడమీ కోఆర్డినేటర్ డాక్టర్ బాలరాజు,  కె రాజ్యలక్ష్మి ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్.ఇందిరా నైనా దేవి, విజయ, డాక్టర్ షబీఫాతిమా, రమేష్, వి.శ్రీనివాస్, జి శ్రీనివాస్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Views: 15

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News