ఈనెల 17న తండాలు, గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలు.

బిఆర్ఎస్  నిజామాబాద్ రూరల్ ఇంచార్జ్ బాజిరెడ్డి జగన్

ఈనెల 17న తండాలు, గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలు.

నిజామాబాద్ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల కేసీఆర్‌ పాలనలో గిరిజనులు, ఎస్టీ, ఎస్సీల సంక్షేమానికి, అభివృద్ధికి చేసిన కార్యక్రమాలను గుర్తుచేసుకుంటూ ఈనెల 17న తండాలు, గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు బీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ రూరల్‌ ఇన్‌ఛార్జి బాజిరెడ్డి జగన్ తెలిపారు. మంగళవారం నగరంలోని మహాలక్ష్మీ కాలనీలోగల తన నివాసంలో జగన్ విలేకర్ల సమావేశం ఏర్పాటుచేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్టీ రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచి నాలుగేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ర్యాలీలు, ప్రత్యేక పూజలు, కేసీఆర్‌ చిత్రపటాలకు పాలాభిషేకాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో తండాలను గ్రామపంచాయతీల ఏర్పాటు, గురుకులాల ద్వారా విద్యావకాశాలు, కళ్యాణలక్ష్మీ, రైతుబంధు, పోడు భూముల హక్కులకు సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలయ్యాయని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం గిరిజనులను విస్మరిస్తుందని, తండాల్లో సమస్యలు అపరిష్కృతంగా పేరుకుపోయాయని, పెండింగ్‌ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్‌చేశారు. 17న బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో జరిగే ప్రత్యేక కార్యక్రమాల్లో గిరిజనులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. సమావేశంలో ఏఐబీఎస్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు శ్రీహరి నాయక్, జిల్లా అధ్యక్షుడు రామావత్‌ మోహన్‌ నాయక్, నాయకులు ధరావత్‌ గోపాల్, గోకుల్‌సింగ్, సంగ్యానాయక్, నాయకపోడు సంఘం జిల్లా నాయకులు అన్నం సాయిలు, అశోక్‌ శివరామ్‌ నాయక్, శంకర్‌ నాయక్, పరుశరాం నాయక్, బన్నీ నాయక్, ఇందల్, సంతోష్,  గౌతమ్, తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడంలో మీడియా కీలక పాత్ర కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడంలో మీడియా కీలక పాత్ర కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
కామారెడ్డి బ్యూరో : ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమైన కార్యక్రమాలు, ముఖ్యంగా సామాజిక సంక్షేమం, ప్రజా భద్రతకు సంబంధించిన అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో మీడియా కీలక...
లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు ల పంపిణీ 
హుస్నాబాద్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో  ఓజోన్ దినోత్సవం
రాచర్ల గొల్లపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో ఏకరూప దుస్తుల పంపిణీ
మోదీ 25 ఏళ్ల పాలనా ప్రస్థానం స్ఫూర్తిదాయకం
ఫ్లెక్సీ చింపిన వ్యక్తులపై కేసు నమోదు
పిల్లలకు ప్రభుత్వం ఇవ్వగలిగే గొప్ప ఆస్తి విద్యే