ఫ్లెక్సీ చింపిన వ్యక్తులపై కేసు నమోదు
మేడిపల్లి/భీమారం (జగిత్యాల ) : మేడిపల్లి మండల కేంద్రంలో నేషనల్ హైవే పక్కన, గ్రామపంచాయతీ అనుమతి తో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రెటరీ బొంగోని రాజాగౌడ్ తెలంగాణ ఎస్.ఐ.ఆర్-2026 కార్యక్రమం గురించి ఫ్లెక్సీని ఏర్పాటు చేయగా, తేదీ 29.07.2026 అర్ధరాత్రి మేడిపల్లి గ్రామానికి చెందిన సూర్యతేజ,హర్ష లు చింపినట్లు ఆధారాలు లభించడంతో, మేదరి లాజర్ ఇచ్చిన ఫిర్యాదు తో కోర్టు అనుమతితో వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మేడిపల్లి ఎస్సై శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, భవిష్యత్తులో ఫ్లెక్సీలను, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసంచేసిన, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వ్యక్తులపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించడం జరిగింది.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


