ప్రధాని మోదీ పుట్టినరోజున ప్రతి ఇంట దీపం వెలిగించాలి

సంగారెడ్డి బిజెపి ఓబీసీ జిల్లా అధ్యక్షుడు కోణం విఠల్

ప్రధాని మోదీ పుట్టినరోజున ప్రతి ఇంట దీపం వెలిగించాలి



పెద్ద శంకరంపేట్,  : పెద్ద శంకరంపేట్  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు పురస్కరించుకొని ప్రతి ఇంటిలో దీపం వెలిగించాలని సంగారెడ్డి జిల్లా బిజెపి ఓబీసీ అధ్యక్షులు కోణం విఠల్ పిలుపునిచ్చారు.. బుధవారం పెద్ద శంకరంపేట లోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో  నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన పురస్కరించుకొని బిజెపి ఆధ్వర్యంలో నెలరోజుల పాటు సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జన్మదిన వేడుకల్లో భాగంగా సెప్టెంబర్ 17వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు ప్రజలు తమ ఇళ్లలో దీపాలు వెలిగించి ప్రధానికి ఆశీస్సులు మద్దతు తెలియజేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నరేంద్ర మోడీ భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన వ్యక్తి అని పేర్కొన్నారు.. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా బిజెపి ఉపాధ్యక్షుడు పత్రి రామకృష్ణ.  నారాయణఖేడ్ బిజెపి పట్టణ అధ్యక్షుడు రాజశేఖర్ గౌడ్ మండల బిజెపి అధ్యక్షుడు శ్రావణ్ కుమార్. బి జె వై ఎం అధ్యక్షులు బుగుడాల కృష్ణ.. టేంకటి వార్డు సభ్యులు వెంకయ్య   తదితరులు పాల్గొన్నారు.

Views: 22

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

టీజీఎస్పీడీసీఎల్ ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను సందర్శించిన SERP సీఈఓ దివ్య దేవరాజన్ టీజీఎస్పీడీసీఎల్ ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను సందర్శించిన SERP సీఈఓ దివ్య దేవరాజన్
హైదరాబాద్: టీజీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ  సీఈఓ శ్రీమతి దివ్య దేవరాజన్,...
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర  సోషల్ మీడియా సెక్రటరీగా కర్రీ నాగేంద్ర బాబు
గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా డీజే ఆపరేటర్లకు కౌన్సెలింగ్.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి
టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన గజ్వెల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి
ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం
సెప్టెంబర్ 17 న హైదరాబాద్ లో టి. ఆర్.పి పాదయాత్ర