సీఎం రేవంత్ రెడ్డి తో సింగపూర్ వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇంధనవాణిజ్య విభాగం శాశ్వత కార్యదర్శి అగస్టిన్ లీ భేటీ.. 

 
IMG-20260916-WA1028
- తెలంగాణలో సెమీ కండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపిన సింగపూర్ ప్రతినిధులు 
 
హైదరాబాద్ : హైదరాబాద్ ను పర్యాటకంగానే కాకుండా నాలెడ్జ్ హబ్ గా తీర్చి దిద్దుతున్నామన్న సీఎం స్పష్టం చేశారు. బుధవారం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తో సింగపూర్ వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఇంధనవాణిజ్య విభాగం శాశ్వత కార్యదర్శి అగస్టిన్ లీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో సెమీ కండక్టర్ల పరిశ్రమ ఏర్పాటు అంశం పై ప్రతినిధులు సీఎం తో చర్చించారు. అదేవిదంగా మూసీ పునరుజ్జీవనం, ఫ్యూచర్స్ సిటీ అభివృద్ధి పలు అంశాలను సింగపూర్ ప్రతినిధులకు సిఎం వివరించారు. 
 
IMG-20260916-WA1030
 
అనఁతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... ఇప్పటికే హార్వార్డ్, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీల, MIT, లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తమ ఆఫ్ షోర్ క్యాంపస్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేసేందుకు అంగీకరించారని తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీని నెట్ జీరో సిటీగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పిన స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు, రాష్ట్ర అభివృద్ధికి ఆర్ధిక పరమైన సహకారం అందించాలని, రాష్ట్రంలో పెట్టుబడులకు అన్నిరకాలుగా ప్రభుత్వం సహకరిస్తుందని సీఎం పేర్కొన్నారు. దీంతో పెట్టుబడులపై సింగపూర్ ప్రతినిధులు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
 
IMG-20260916-WA1029
 
ఈ సందర్భంగా సింగపూర్ ప్రతినిధులను ఫ్యూచర్ సిటీలో డిసెంబరులో నిర్వహించే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కు ముఖ్యమంత్రి ఆహ్వానించారు. తొలిదశలో మూసా, ఈసా నదుల సంగమం గాంధీ సరోవర్ వరకు మూసీ పునరుజ్జీవనం చేపట్టనున్నట్లు సీఎం తెలిపారు- రివర్ ఫ్రంట్ అభివృద్ధితో పాటు, నైట్ ఎకానమీ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు, దక్షిణాసియా సీనియర్ డైరెక్టర్ డాక్టర్ ఫ్రాన్సిస్ చోంగ్, కాన్సుల్-జనరల్ విలియం చిక్, ఇతర సింగపూర్ ప్రతినిధులు పాల్గొన్నారు.
 
 

 

Views: 5

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Related Posts

Error on ReusableComponentWidget

Latest News

టీజీఎస్పీడీసీఎల్ ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను సందర్శించిన SERP సీఈఓ దివ్య దేవరాజన్ టీజీఎస్పీడీసీఎల్ ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను సందర్శించిన SERP సీఈఓ దివ్య దేవరాజన్
హైదరాబాద్: టీజీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ  సీఈఓ శ్రీమతి దివ్య దేవరాజన్,...
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర  సోషల్ మీడియా సెక్రటరీగా కర్రీ నాగేంద్ర బాబు
గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా డీజే ఆపరేటర్లకు కౌన్సెలింగ్.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి
టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన గజ్వెల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి
ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం
సెప్టెంబర్ 17 న హైదరాబాద్ లో టి. ఆర్.పి పాదయాత్ర