అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు: జిల్లా కలెక్టర్ రాజర్షి షా

నార్నూర్ మండలం జామ్డ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు, గ్రామపంచాయతీ భవనం ప్రారంభం

అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు: జిల్లా కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్  నార్నూర్ మండలం జామ్డ గ్రామంలో మంగళవారం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి, జిల్లా కలెక్టర్ రాజర్షి షా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనంతో పాటు ఇందిరమ్మ ఇళ్లను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మరో లబ్ధిదారుడి ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ నిర్వహించి, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అర్హులైన లబ్ధిదారులకు కలెక్టర్ చేతుల మీదుగా భూమి పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామస్థాయిలో ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సులభంగా, పారదర్శకంగా అందించేందుకు అవసరమైన మౌలిక వసతులను కల్పిస్తున్నామని పేర్కొన్నారు. తాగునీరు, రహదారులు, విద్యుత్ తదితర మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకుని సొంతింటి కలను సాకారం చేసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే కోవా లక్ష్మి మాట్లాడుతూ, నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకం దోహదపడుతుందని తెలిపారు. నూతన గ్రామపంచాయతీ భవనం అందుబాటులోకి రావడంతో ప్రజలకు స్థానిక పాలన, ప్రభుత్వ సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ శంకర్, హౌసింగ్ డీఈ షకీర్, ఏఈ రాకేష్, తహశీల్దార్ రాజలింగు, ఎంపీడీవో కే. పుల్లారావు, సర్పంచ్ చందర్శావ్, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Views: 34

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం
హైదరాబాద్ : బీసీ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించి, వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పడే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న *“ఇంటింటా ఇందిరమ్మ కుట్టు...
సెప్టెంబర్ 17 న హైదరాబాద్ లో టి. ఆర్.పి పాదయాత్ర
బాలాపూర్ లో స్పీకర్ గడ్డ ప్రసాద్ కు ఘన స్వాగతం
ప్రధాని మోదీ పుట్టినరోజున ప్రతి ఇంట దీపం వెలిగించాలి
సీఎం రేవంత్ రెడ్డి తో సింగపూర్ వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇంధనవాణిజ్య విభాగం శాశ్వత కార్యదర్శి అగస్టిన్ లీ భేటీ.. 
సెప్టెంబర్‌ 17పై సమరశంఖం!
చాంద టి నిమజ్జన ప్రదేశాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్